Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార్యను కొట్టిన డివిలియర్స్‌.. ఆపై దొంగతనం (వీడియో)!!

AB De Villiers Boring Meditation Routine Takes His Wife By Surprise

కేప్‌టౌన్‌: ప్రపంచవ్యాప్తంగా తన పంజా విసురుతున్న మహమ్మారి కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 208 దేశాలకు విస్తరించింది. ప్రపంచ దేశాల్లో 12,73,990 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,60,247 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక మృతుల సంఖ్య 70 వేలకు చేరువవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ రెగ్యులర్‌ కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ ప్రజలందరూ ఇంటి జీవితాన్ని గడుపుతున్నారు. చాలామంది కుటుంబ సభ్యులతో సరదా సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.

బోరింగ్‌ ధ్యానం:

బోరింగ్‌ ధ్యానం:

అయితే కరోనా కారణంగా కొందరు క్రికెటర్లు మరీ బోర్‌ ఫీలవుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో మొత్తం క్రికెట్‌ టోర్నీలన్నీ రద్దు కావడంతో క్రికెటర్లు కనీసం ప్రాక్టీస్‌ చేసుకునే వీలు కూడా లేకుండా పోయింది. ఇంట్లో పని, కాలక్షేపం​ తప్పితే పెద్దగా చేసే పనేమీ వారికి కనబడుటం లేదు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ బోర్‌ ఫీలవుతున్నాడట. అయితే ఇంట్లోని ఫ్లోర్‌ మీద వెల్లకిలా పడుకుని 'బోరింగ్‌ ధ్యానం' చేస్తూ.. కాలం వెల్లడిస్తున్నాడట.

 బంతితో భార్యను కొట్టిన డివిలియర్స్‌:

బంతితో భార్యను కొట్టిన డివిలియర్స్‌:

డివిలియర్స్‌ తన ఇంట్లోని ఫ్లోర్‌ మీద వెల్లకిలా పడుకుని బోరింగ్‌ ధ్యానం చేస్తూ.. అదే సమయంలో బంతిని తీసుకుని సీలింగ్‌కు కొడుతూ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ వీడియోను తన భార్య తీస్తుండగా.. డివిలియర్స్‌ అదేపనిగా సీలింగ్‌కు బంతిని కొడుతూ తిరిగి వచ్చిన ఆ బంతిని క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే చివరగా ఆ బంతితోనే వీడియో తీస్తున్న తన భార్యను కొట్టాడు. క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేసే క్రమంలో బంతిని పట్టుకుని భార్యపైకి విసిరాడు. ఈ ఘటనకు డివిలియర్స్‌ భార్య ఒక్కసారిగా కంగారు పడింది.

వీడియోను దొంగిలించా:

వీడియోను దొంగిలించా:

ఈ ఘటనకు సంబందించిన వీడియో డివిలియర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఆ వీడియోను తన భార్య నుండి దొంగిలించానని కూడా అతడు పేర్కొన్నాడు. 'నాకు చిన్నతనం నుంచి ఇలా చేయడం అలవాటు. నేను దీన్ని గంటలు తరబడి చేయగలను. నేను అదే పనిలో ఉండగా నా భార్య వీడియో తీసింది. ఈ వీడియో క్రెడిట్‌ అంతా ఆమెదే. కానీ దాన్ని దొంగిలించి నేను కూడా సర్‌ప్రైజ్‌ ఇచ్చా' అని డివిలియర్స్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోహిత్ కూడా:

రోహిత్ కూడా:

ఇటీవలే టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ కూడా బోరింగ్‌గా ఫీలయిన విషయం తెలిసిందే. 'ముంబైలో నేను ఉండే ఫ్లాట్‌ 54వ అంతస్తులో ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇందులో ఉండే అధునాతన జిమ్‌లను మూసివేశారు. నేను అనుకున్నా సరే.. బయటకు వెళ్లే అవకాశం లేదు. నాలుగు అంతస్తులు పైకి, కిందకి పరుగెత్తడం మినహా మరో మార్గం లేదు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో మరింత మెరుగైన ఫిట్‌నెస్‌ ప్రణాళిక అమలు చేసి ఉంటే బాగుండేది' అని రోహిత్ పేర్కొన్నాడు.

Story first published: Monday, April 6, 2020, 12:57 [IST]
Other articles published on Apr 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+