Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్ మ్యాన్ ఏబీడీ.. 41 ఏళ్ల వయసులోనూ అద్భుత క్యాచ్‌తో అదరహో!(వీడియో)

INDCH vs SACH: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది. మంగళవారం రాత్రి ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్‌ను కూడా ప్రదర్శించారు. బౌండరీ లైన్ వద్ద డివిలియర్స్ చేసిన అసాధారణ ఫీల్డింగ్.. 41 ఏళ్ల వయసులోనూ ఆయనకున్న చురుకుదనం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన అద్భుతమైన ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఏబీ డివిలియర్స్ ఫీల్డింగ్ చూసి అందరూ అవాక్కయ్యారు..
ఇమ్రాన్ తాహిర్ వేసిన ఓవర్లో యూసుఫ్ పఠాన్ ఒక భారీ షాట్ ఆడాడు. అది దాదాపు బౌండరీ బయటకు వెళుతుందని అనిపించింది. అయితే ఏబీ డివిలియర్స్ బౌండరీ వద్ద డెైవ్ చేసి ఆ బంతిని క్యాచ్ పట్టి వెంటనే సహచర ఆటగాడి వైపు విసిరాడు. దీంతో యూసుఫ్ పఠాన్ పెవిలియన్ చేరక తప్పలేదు. 41 ఏళ్ల వయసులో ఏబీ డివిలియర్స్ అద్భుతమైన ఫీల్డింగ్ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

AB de Villiers at 41 Stunning Catch in World Championship of Legends 2025 A Superman Moment

బ్యాటింగ్‌లోనూ ఏబీడీ విధ్వంసం
అంతకుముందు ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అర్థ సెంచరీ సాధించారు. మ్యాచ్ లో డివిలియర్స్ కేవలం 30 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో ఏబీ డివిలియర్స్ 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా ఛాంపియన్స్ 18.2 ఓవర్లలో కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా ఛాంపియన్స్ తరఫున బ్యాటింగ్‌లో స్టువర్ట్ బిన్నీ అత్యధికంగా 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేయకపోవడం గమనార్హం.

Story first published: Wednesday, July 23, 2025, 10:21 [IST]
Other articles published on Jul 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+