For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ సంచలన నిర్ణయం: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

By Nageshwara Rao
AB de Villiers Announces His Retirement (Video)
AB de Villiers announces his retirement from all forms of international cricket

హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది చేదువార్త. తన అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.

ఈ వీడియోలో డివిలియర్స్ 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.

ఇది చాలా కఠిన నిర్ణయం

'ఇది చాలా కఠిన నిర్ణయం కానీ చాలా కాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను.. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. క్రికెట్ దక్షిణాకాకి, నా జట్టు సభ్యులకు, దక్షిణాఫ్రికా, ప్రపంప వ్యాప్తంగా నా వెనుక ఉండి నాకు మద్దతు తెలిపిన అభిమానులకు నా ధన్యవాదాలు' అని డివిలియర్స్ తెలిపాడు.

వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు

వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు

'ఇండియా, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించాను. ఇక నా సహచక క్రికెటర్లకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు. ఇక నావల్ల కాదు అనిపించింది. నా నిర్ణయాన్ని అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు. విదేశాల్లో ఆడే ఆలోచన కూడా నాకు లేదు. అయితే దేశీయంగా టైటాన్స్ టీమ్‌కు మాత్రం ఆడతాను' అని డివిలియర్స్ తెలిపాడు.

14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన డివిలియర్స్

14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన డివిలియర్స్

ఇదే సరైన సమయమని చెప్పిన డివిలియర్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు.

భారత్‌లో ఎంతో మంది అభిమానులు

భారత్‌లో ఎంతో మంది అభిమానులు

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న డివిలియర్స్ తన బ్యాటింగ్ స్టైల్‌తో భారత్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా, తాను అంతర్జాతీయ క్రికెట్‌కి మాత్రమే వీడ్కోలు పలుకుతున్నానని, దేశవాళీ క్రికెట్‌కి మాత్రం అందుబాటులో ఉంటానని డివిలియర్స్ వీడియోలో పేర్కొన్నాడు.

నిరాశకు గురైన అభిమానులు

ఇదిలా ఉంటే 2019 వరల్డ్‌కప్‌కు ముందు డివిలియర్స్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో దక్షిణాఫ్రికా జట్టుక భారీ ఎదురుదెబ్బ తగిలినట్టేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉన్నట్టుండి సడన్‌గా ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.

డివిలియర్స్ పేరిట అనేక రికార్డులు

డివిలియర్స్ పేరిట అనేక రికార్డులు

అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కూడా డివిలియర్సే కావడం విశేషం. మొత్తం 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక, 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, May 23, 2018, 17:41 [IST]
Other articles published on May 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+