For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇవ్వాలని ఫిక్సయ్యా.. మంచి పనికి పూనుకున్న ఏబీ డివిలియర్స్

AB de Villiers Adopt Two Under Privileged Youngsters Of India in a Make A Different Initiative

దక్షిణాఫ్రికా గొప్ప బ్యాటర్‌లలో ఏబీ డివిలియర్స్ ఒకరు. అతను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన NGOలలో ఒకటైన మేక్ ఏ డిఫరెన్స్ (MAD)కు తన సహకారం అందించడానికి సిద్ధమయ్యాడు. వెనుకబడిన పిల్లల కెరీర్‌ మెరుగుపరిచేందుకు ఈ ఎన్జీవో పనిచేస్తుంది. ఐపీఎల్లో డివిలియర్స్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎన్నో ఏళ్లు ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో డివిలియర్స్‌కు విపరీతమైన క్రేజు ఉంది. అందువల్ల అతనికి భారత్‌లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. అతని పవర్ హిట్టింగ్ కోసం ప్రేక్షకులు ఆర్సీబీ ఆడే మ్యాచ్‌ల కోసం ఎగబడేవారు.

ఇద్దరిని దత్తత తీసుకున్న డివిలియర్స్..

ఇద్దరిని దత్తత తీసుకున్న డివిలియర్స్..

'మేక్ ఏ డిఫరెన్స్' ఎన్జీవో 10 నుంచి 28 సంవత్సరాల మధ్య గల పేద యువకుల కెరీర్ డెవలప్ మెంట్ కోసం పనిచేస్తుంది. వారి చదువులు, వృత్తిలో నిలదొక్కుకోవడానికి కావాల్సినంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా డివిలియర్స్ లక్నోకు చెందిన 18 ఏళ్ల అయాన్‌ను దత్తత తీసుకున్నాడు. అయాన్ అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. అలాగే బెంగళూరులోని 21ఏళ్ల జర్నలిజం విద్యార్థిని అయిన అనిత కెరీర్లో నిలదొక్కుకోవడానికి డివిలియర్స్ కావాల్సినంత ఆర్థిక సహకారాన్ని అందించనున్నాడు.

వారి పేదరికం సమసిపోయేంత వరకు చేయూత

వారి పేదరికం సమసిపోయేంత వరకు చేయూత

ఇన్నేళ్లుగా భారత్ తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాల గురించి డివిలియర్స్ పేర్కొన్నాడు. భారత్ నుంచి ఎంతో పొందానని ప్రతిఫలంగా ఏదైనా చేయాలనే తన కోరికను వెల్లడించాడు. అతను MADతో అనుబంధం కలిగి ఉన్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ ఎన్జీవో చేస్తున్న పనులను మెచ్చుకున్నాడు.

'ఇన్నేళ్లుగా భారత్ నా పట్ల చాలా చూపుతున్న ప్రేమాభిమానాలు ఎనలేనివి. నేను అందుకు ఏదైనా తిరిగి ఇవ్వాలని చూసేవాడిని. అందులో భాగంగా MADతో నాకు ఓ మంచి సంబంధం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు యువకులకు ఆర్థికంగా, మోరల్‌గా సపోర్ట్ చేయడానికి మార్గనిర్దేశం చేస్తాను. వారి పేదరికం సమసిపోయేంత వరకు వారికి స్థిరమైన మద్దతును నా తరఫున ఎంఏడీ అందిస్తుంది.' అని డివిలియర్స్ తెలిపాడు.

మిస్టర్ 360 మద్దతు దక్కడం సంతోషంగా ఉంది

మిస్టర్ 360 మద్దతు దక్కడం సంతోషంగా ఉంది

మేక్ ఎ డిఫరెన్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జితిన్ నెదుమల మాట్లాడుతూ.. డివిలియర్స్ సహకారం సంతోషించదగ్గది అని పేర్కొన్నాడు. స్వచ్ఛందంగా ఈ ఎన్జీవోను నడపడమే మా ఉద్దేశం. మా కార్యక్రమానికి ఏబీ డివిలియర్స్ లాంటి గ్లోబల్ స్పోర్టింగ్ ఐకాన్ మద్దతునివ్వడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ 360 మా సంస్థ పట్ల చూపిన విధేయత అతని మద్దతు.. మరింత మంది పిల్లలకు సహాయం చేయాలనే మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది.' అని జితిన్ పేర్కొన్నాడు.

Story first published: Friday, August 19, 2022, 20:25 [IST]
Other articles published on Aug 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+