Big Bash League: ఒంటిచేత్తో గెలిపించిన ఫించ్.. మళ్లీ ఓడిన సిడ్నీ థండర్

బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టు వరుసగా రెండో మ్యాచులోనూ ఓడింది. మెల్‌బోర్న్ రెనగేడ్స్‌తో జరిగిన మ్యాచులో టాస్ గెలిచిన థండర్ కెప్టెన్ జేసన్ సంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ జట్టుకు శుభారంభం దక్కకపోయినా రైలీ రూసో (53), అలెక్స్ రాస్ (39) ఇద్దరూ రాణించారు. మిడిల్ ఓవర్లలో రూసో జట్టును ముందుండి నడిపించగా..
చివర్లో రాస్ వేగంగా ఆడాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రెనగేడ్స్ జట్టులో విల్ సదర్‌ల్యాండ్ తప్ప మిగతా బౌలర్లంతా వికెట్లు తీసుకున్నారు. టామ్ రాజర్స్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
ఒంటిచేత్తో లాక్కెళ్లిన ఫించ్..
లక్ష్య ఛేదనలో రెనగేడర్స్ ఓపెనర్ శామ్ హార్పర్ (0) డకౌట్ అవడంతో ఆ జట్టుకు కూడా శుభారంభం దక్కలేదు. అయితే కెప్టెన్ నిక్ మ్యాడిన్సన్ (39), జేక్ ఫ్రేజర్ (24) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 70 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోయినా తనొక్కడే ఒంటి చేత్తో రెనగేడ్స్ జట్టును లక్ష్యం దిశగా నడిపాడు.
రాణించిన సిడ్నీ బౌలర్లు..
రెనగేడ్స్ టాపార్డర్ కొంత ఫర్వాలేదనిపించినా.. సిడ్నీ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్క ఫించ్ తప్ప మిగతా బ్యాటర్లెవరూ వాళ్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ముఖ్యంగా సిడ్నీ బౌలర్ డానియల్ శామ్స్ రెనగేడ్స్ జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతోపాటు మూడు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. అతనితోపాటు గురీందర్ సంధు కూడా రెండు వికెట్లతో రాణించాడు. బ్రెండన్ డాగెట్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
చివరి ఓవర్లో టెన్షన్..
చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం అవగా.. తొలి బంతికే అకీల్ హొస్సేన్ (13)ను గురీందర్ సంధు అవుట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అకీల్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న డేవీస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అది రెనగేడ్స్ కోల్పోయిన ఆరో వికెట్. అప్పటికి రెనగేడ్స్ గెలవాలంటే ఐదు బంతుల్లో 11 పరుగులు చేయాలి. రెండో బంతికి సదర్‌ల్యాండ్ సింగిల్ తీయగా.. మూడో బంతికి ఫించ్ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత రెండు బంతులకు రెండేసి పరుగులు తీసిన అతను ఛేజ్‌ను పూర్తి చేశాడు. దీంతో రెనగేడ్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో థండర్‌ను ఓడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications