For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

172: టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆరోన్ ఫించ్

By Nageshwara Rao
Aaron Finch scores 172 off 76 balls; highest T20I individual knock

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 172 పరుగులు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

తద్వారా టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 2013లో ఇంగ్లాండ్‌పై ఫించ్ నమోదు చేసిన 156 పరుగుల రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఫించ్‌, డీ ఆర్సీ షాట్‌లు దూకుడుగా ఆరంభించారు.

ఈ క్రమంలో డీ ఆర్సీ షాట్‌(46; 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, ఆరోన్ ఫించ్‌ మాత్రం ఆకాశమే హద్దుగా విజృంభించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 223 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ మ్యాచ్‌లో మరో టీ20 ప్రపంచ రికార్డు కూడా నమోదైంది.

డార్సీ షార్ట్‌తో కలిసి తొలి వికెట్‌కు ఫించ్ 223 పరుగులు జోడించాడు. టీ20ల్లో ఇది తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం. దీంతో గతంలో కివీస్ ఆటగాళ్లు మార్టిన్ గుప్టిల్-కేన్ విలియమ్సన్ నెలకొల్పిన 171 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు బద్దలైంది.

50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ. సెంచరీ అనంతరం ఫించ్ జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ఫించ్ ఇన్నింగ్స్‌లో 124 పరుగులు ఫోర్లు, సిక్సర్లు ద్వారా రావడం విశేషం. ఓపెనర్‌గా బరిలోకి వచ్చిన ఫించ్‌ ఆఖరి ఓవర్‌ నాలుగో బంతికి హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు.

ఆరోన్ ఫించ్‌ విజృంభణతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ముక్కోణపు టీ20 సిరిస్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఫించ్ కేవలం 33 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు. జస్టిన్ లాంగర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసీస్ అందుకున్న తొలి విజయం.

టీ20ల్లో ఆత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్
* Aaron Finch: 172 off 76 balls: Aus v Zim, Harare, 2018
* Aaron Finch: 156 off 63 balls: Aus v Eng, Southampton, 2013
* Glenn Maxwell: 145 off 65 balls: Aus v SL, Pallekele, 2016
* Evin Lewis: 125 off 62 balls: WI v India, Kingston, 2017
* Shane Watson: 124 off 71 balls: Aus v India, Sydney, 2016

Story first published: Tuesday, July 3, 2018, 16:56 [IST]
Other articles published on Jul 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+