ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ కోహ్లీనే.. అతన్ని త్వరగా ఔట్ చేయడమే మా టార్గెట్: ఆరోన్ ఫించ్

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డేల్లో విరాట్ రికార్డులు అద్భుతమని, అతను ఆల్‌టైమ్ బెస్ట్ వన్డే క్రికెటర్ అని కొనియాడాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్.. శుక్రవారం తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఫించ్.. తమ ఫోకస్ అంతా కోహ్లీని ఔట్ చేయడంపై ఉందన్నాడు. అతని వికెట్ తీస్తేనే తమకు విజయవకాశాలుంటాయని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020లో విరాట్ కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూం పంచుకున్న ఆరోన్ ఫించ్.. అతనికి ఎక్కువగా బలహీనతలు లేవన్నాడు. అదే అతని సక్సెస్‌కు కారణమని చెప్పుకొచ్చాడు.

కోహ్లీకి బలహీనతల్లేవ్..

కోహ్లీకి బలహీనతల్లేవ్..

‘వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డులు అద్భుతం. అవి అసాధారణమైనవి. అందుకే తమ దృష్టంతా అతన్ని ఔట్ చేయడంపైనే. ఈ విషయం కొంచెం అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకుంటే విరాట్ కోహ్లీకి బలహీనతలు చాలా తక్కువ. విరాట్ ఆల్‌టైమ్ బెస్ట్ వన్డే ప్లేయర్. విరాట్‌ను కట్టడి చేయాలంటే తమ వ్యూహాలకు కట్టుబడి ఉండాలి.'అని ఫించ్ అభిప్రాయపడ్డాడు.

 స్టోయినిస్, మ్యాక్సీ..

స్టోయినిస్, మ్యాక్సీ..

ఆస్ట్రేలియా తుది జట్టుపై స్పందించిన ఫించ్.. మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌‌వెల్ వంటి నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉండటం కలిసిరానుందన్నాడు. ఈ ఇద్దరూ కీలకం కానున్నారని జోస్యం చెప్పాడు. ‘మ్యాక్సీ బౌలింగ్ చాలా మెరుగైంది. మార్కస్ స్టోయినిస్ గత రెండేళ్లుగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు జట్టులో చాలా కీలకం. జట్టు కూడా సమతూకంగా ఉంటుంది. ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల బౌలర్ల కూడా పని సులువవుతుంది. రకరకాల కాంబినేషన్స్ ప్రయత్నించడానికి వీలు కలుగుతుంది'అని ఫించ్ తెలిపాడు.

 రివేంజ్ టైమ్..

రివేంజ్ టైమ్..

2018-19 సీజన్లో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా తహతలాడుతోంది. ఆ సీజన్‌లో వన్డే సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ను గెలిచిన భారత్.. 1-1తో టీ20 సిరీస్‌ను సమం చేసింది. సొంత గడ్డపై భారత్‌ చేతిలో ఒక్క సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా గెలవకపోవడం అదే తొలిసారి.

దీంతో ఈసారి ఎలాగైనా లెక్క సరి చేయాలనే కసితో ఆస్ట్రేలియా బరిలో దిగుతోంది. వన్డే, టీ20ల్లో జట్టును గెలిపించే బాధ్యత పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై ఉంది. తొలి టెస్టు ముగియగానే కోహ్లి తిరిగి భారత్ వచ్చేయనున్నాడు. దీంతో వన్డే, టీ20 సిరీస్‌లపై కోహ్లి తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది.

India vs Australia 2020 1st ODI: కోహ్లీ సేన బోణీ కొట్టెనా? తొలి పోరుకు తుది జట్లు ఇవే!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, November 26, 2020, 18:09 [IST]
Other articles published on Nov 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X