
కోహ్లీకి బలహీనతల్లేవ్..
‘వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డులు అద్భుతం. అవి అసాధారణమైనవి. అందుకే తమ దృష్టంతా అతన్ని ఔట్ చేయడంపైనే. ఈ విషయం కొంచెం అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకుంటే విరాట్ కోహ్లీకి బలహీనతలు చాలా తక్కువ. విరాట్ ఆల్‌టైమ్ బెస్ట్ వన్డే ప్లేయర్. విరాట్‌ను కట్టడి చేయాలంటే తమ వ్యూహాలకు కట్టుబడి ఉండాలి.'అని ఫించ్ అభిప్రాయపడ్డాడు.

స్టోయినిస్, మ్యాక్సీ..
ఆస్ట్రేలియా తుది జట్టుపై స్పందించిన ఫించ్.. మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ వంటి నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉండటం కలిసిరానుందన్నాడు. ఈ ఇద్దరూ కీలకం కానున్నారని జోస్యం చెప్పాడు. ‘మ్యాక్సీ బౌలింగ్ చాలా మెరుగైంది. మార్కస్ స్టోయినిస్ గత రెండేళ్లుగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు జట్టులో చాలా కీలకం. జట్టు కూడా సమతూకంగా ఉంటుంది. ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల బౌలర్ల కూడా పని సులువవుతుంది. రకరకాల కాంబినేషన్స్ ప్రయత్నించడానికి వీలు కలుగుతుంది'అని ఫించ్ తెలిపాడు.

రివేంజ్ టైమ్..
2018-19 సీజన్లో 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా తహతలాడుతోంది. ఆ సీజన్లో వన్డే సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ను గెలిచిన భారత్.. 1-1తో టీ20 సిరీస్‌ను సమం చేసింది. సొంత గడ్డపై భారత్ చేతిలో ఒక్క సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా గెలవకపోవడం అదే తొలిసారి.
దీంతో ఈసారి ఎలాగైనా లెక్క సరి చేయాలనే కసితో ఆస్ట్రేలియా బరిలో దిగుతోంది. వన్డే, టీ20ల్లో జట్టును గెలిపించే బాధ్యత పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై ఉంది. తొలి టెస్టు ముగియగానే కోహ్లి తిరిగి భారత్ వచ్చేయనున్నాడు. దీంతో వన్డే, టీ20 సిరీస్‌లపై కోహ్లి తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది.
India vs Australia 2020 1st ODI: కోహ్లీ సేన బోణీ కొట్టెనా? తొలి పోరుకు తుది జట్లు ఇవే!