ఆ కేప్టెన్ టాస్ గెలుస్తాడు గానీ మ్యాచ్ లను గెలవలేడు: ఏమి సెటైర్లు వేస్తిరి
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్ పలు రికార్డులను తిరగరాసింది. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తాను ఎంత గొప్ప బ్యాటరో నిరూపించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 350 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ సిక్సర్స్ ఇవి.
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ-135 (నాటౌట్), ట్రావిస్ హెడ్-37, ఇషాన్ కిషన్- 25, హెన్రీచ్ క్లాసెన్- 37 (నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. ఇషాన్ రనౌట్ అయ్యాడు.

ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసింది. నితీష్ రాణా- 57 తో రాణించాడు. కేఎల్ రాహుల్- 37, సమీర్ రిజ్వీ- 41 పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగా నాలుగు వికెట్లతో బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటాడు. దిల్షాన్ మదుషంక, సాకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో ఓటమితో ఢిల్లీ కేపిటల్స్ జట్టు సారథి అక్షర్ పటేల్ పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ కేప్టెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో 'టైమ్ అవుట్' షోలో ఆయన మాట్లాడాడు. ఢిల్లీ కేపిటల్స్ లో కీలక స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్ కలిసి నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారని, పార్ట్‌టైమర్ నితీష్ రాణా నాలుగు ఓవర్లు వేయించాడని, ఈ గేమ్ ప్లాన్ ఏంటో తనకైతే అర్థమే కాలేదని అన్నాడు. ఇక్కడ కూర్చుని తల గోక్కున్నామని ఎద్దేవా చేశాడు.
అక్షర్ పటేల్ వంటి ఎక్స్ పీరియన్స్ బౌలర్ పూర్తి కోటా ఓవర్లు వేయకపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు ఫించ్. రెండు ప్రపంచ కప్‌లు గెలిచిన ఆటగాడు కాబట్టి ఆతిగా ఆత్మవిశ్వాసం పొందినట్టనిపించిందని ఎద్దేవా చేశాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడని చురకలు అంటించాడు. గతంలో ఎనిమిది బంతుల్లో అభిషేక్ శర్మను రెండుసార్లు పటేల్ అవుట్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. టాస్ లు గెలిచిన అనుభవం ఉందేమో గానీ మ్యాచ్ లను గెలిపించలేకపోతున్నాడని వ్యాఖ్యానించాడు.
పటేల్ ఎత్తు, వివిధ కోణాల నుండి బౌలింగ్ చేయగల సామర్థ్యం దాడి సాధనాలు, అదనపు బలాలుగా ఉపయోగించుకోవచ్చని, అయినా ఆ విషయంపై పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనిపించలేదని ఫించ్ అన్నాడు. కొన్ని మంచి బంతులు వేస్తే, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుందే తప్ప, అసలు వేయకపోతే కష్టమని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications