For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌తో సిరిస్: ఆరోన్ ఫించ్‌కే టీ20 పగ్గాలు

Aaron Finch named Australia’s T20 captain for Pakistan series

హైదరాబాద్: ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ ఎన్నికయ్యాడు. ఆక్టోబర్ 24 నుంచి యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఆరోన్ ఫించ్‌ సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది.

దీంతో పాటు పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌కు తొలి సారి ఆసీస్ సెలక్షన్‌ కమిటీ ఇద్దరు వైస్‌ కెప్టెన్‌లను నియమించింది. జట్టు వ్యూహాలు, ప్రణాళికలు, నిర్ణయాలు మరింత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇద్దరు వైస్ కెప్టెన్లను ఎంపికచేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.

కెప్టెన్ టిమ్ పైన్‌కు మద్దతుగా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, ఫాస్ట్ బౌలర్ జొష్ హాజెల్‌వుడ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపింది. జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే విషయంపై ఆటగాళ్లతోపాటు కోచ్ జస్టిన్ లాంగర్, సెలక్టర్ ట్రెవర్ హాన్స్ కూడా ఓటు చేశారు.

మిచెల్ మార్ష్, హాజెల్‌వుండ్ పేర్లు తెరపైకి రావడంతో, తుది నిర్ణయాన్ని సీఏకు అప్పగించారు. దీంతో మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ కారీ వైస్‌ కెప్టెన్‌లుగా అవకాశం లభించింది. ఇదిలా ఉంటే, ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కెప్టెన్సీతో ఆకట్టుకున్న ఆరోన్ ఫించ్‌పై పూర్తి నమ్మకం ఉందని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు.

"టీ20 క్రికెట్‌లో ఆరోన్ ఫించ్‌ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను జట్టును ముందుండి నడిపించగలడు"అని ఆరోన్ ఫించ్‌పై కోచ్‌ లాంగర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. గాయాలతో గత సిరీస్‌కు దూరమైన క్రిస్‌ లిన్, కౌల్టర్‌నైల్‌ తిరిగి జట్టులోకి రాగా, యువ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా, బెన్‌ మెక్‌ డెర్మాట్‌ సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు.

పాక్‌తో తలపడనున్న ఆసీస్ టీ20 జట్టు:
Aaron Finch (captain), Mitch Marsh, Alex Carey, Ashton Agar, Nathan Coulter-Nile, Chris Lynn, Nathan Lyon, Glenn Maxwell, Ben McDermott, Darcy Short, Billy Stanlake, Mitch Starc, Andrew Tye, Adam Zampa

Story first published: Saturday, October 6, 2018, 12:55 [IST]
Other articles published on Oct 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+