న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో ఫించ్‌కి దక్కని చోటు.. కెప్టెన్‌గా స్మిత్!!

Aaron Finch left out of Australia 2023 World Cup XI list, Steve Smith as captain

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉంది కదా!!. కరోనా వైరస్ కారణంగా మెగా టోర్నీ జరుగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇంతకు జట్లను కూడా ఏ బోర్డు ప్రకటించలేదు. మరి ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్‌కి ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడం ఏంటి అనుకుంటున్నారా?. మరేంలేదండి.. 2023 వన్డే ప్రపంచకప్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇదే అని తాజాగా పాక్స్ క్రికెట్ ఓ ఆసీస్ జట్టును ప్రకటించింది. అందులో ఫించ్‌కి చోటు దక్కలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా.. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

<strong>ధోనీ చేసిన ఆ మంచి పనితో.. ఓ స్వచ్ఛంద సంస్థకు ఊహించని రీతిలో విరాళాలు!!</strong>ధోనీ చేసిన ఆ మంచి పనితో.. ఓ స్వచ్ఛంద సంస్థకు ఊహించని రీతిలో విరాళాలు!!

కెప్టెన్‌గా స్మిత్:

కెప్టెన్‌గా స్మిత్:

2023 వన్డే ప్రపంచకప్‌కి ఆస్ట్రేలియా టీమ్ ఇలా ఉండబోతోందని శుక్రవారం పాక్స్ క్రికెట్ 11 మందితో కూడిన ఆసీస్ జట్టును విడుదల చేసింది. ఈ జట్టులో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్‌కి చోటు దక్కలేదు. అయితే పాక్స్ క్రికెట్ స్టీవ్‌ స్మిత్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక్కడ ఫించ్ సహచరుడు డేవిడ్ వార్నర్ మాత్రం ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. 2023 ప్రపంచకప్‌కి భారత్ ఆతిథ్యమివ్వనుంది.

ఓపెనర్‌గా జోష్ ఫిలిప్‌

ఓపెనర్‌గా జోష్ ఫిలిప్‌

డేవిడ్ వార్నర్‌కు జతగా జోష్ ఫిలిప్‌ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. టోర్నమెంట్ జరిగే సమయానికి ఫించ్, వార్నర్ ఇద్దరికీ 36 సంవత్సరాలు వస్తాయి. అయితే ఫించ్‌ను ఎంపికచేసుకోకపోవడం విశేషం. మూడో స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ను తీసుకుంది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధానికి గురైన స్మిత్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఫించ్, మరోవైపు పైనీ ఆసీస్ జట్టును సమర్ధవంతంగా నడిపిస్తుండడంతో.. స్మిత్‌కు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్లు తగ్గాయి.

 ఫించ్ ఆశ్చర్యం

ఫించ్ ఆశ్చర్యం

మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్ మిడిల్ భారాన్ని మోయనున్నారని పాక్స్ క్రికెట్ తెలిపింది. కామెరూన్ గ్రీన్‌కు కూడా పాక్స్ క్రికెట్ చోటిచ్చింది. అస్గన్ అగర్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలను బౌలర్ల జాబితాలో ఎంపిక చేసుకుంది. జట్టులో తన పేరు లేకపోవడంపై అరోన్ ఫించ్ ట్విట్టర్ టైమ్‌లైన్‌ ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. స్మిత్ తర్వాత వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు ఫించ్ అందుకున్న విషయం తెలిసిందే.

పాక్స్ క్రికెట్ జట్టు ఇదే

పాక్స్ క్రికెట్ జట్టు ఇదే

డేవిడ్ వార్నర్, జోష్ పిలిప్, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అస్గన్ అగర్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా.

Story first published: Friday, March 27, 2020, 15:01 [IST]
Other articles published on Mar 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X