Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంకతో టీ20 సిరిస్: ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్

హైదరాబాద్: స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్‌ సారథ్యం వహించనున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు గాయం కావడంతో ఫించ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 2న న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డే నుంచే ఫించ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు.

మరోవైపు ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్ సిరిస్ ఆడేందుకు భారత పర్యటనకు రానుంది. భారత పర్యటనను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌లకు కూడా శ్రీలంకతో జరిగే సిరీస్‌లో విశ్రాంతినిచ్చారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫిబ్రవరి 17నుంచి ఆసీస్‌, శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది.

Aaron Finch to lead Australia T20I team against Sri Lanka

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లతో పాటు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ హజల్ వుడ్, ఉస్మాన్ ఖజాలు భారత్ పర్యటనకు రానున్న జట్టులో సభ్యులుగా ఉన్నారు. స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరిస్‌కు ఫించ్ కెప్టెన్‌గా ఎంపికవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

మరోవైపు ఫిబ్రవరిలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడైన రికీ పాంటింగ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, సహాయ కోచ్‌ జాసన్‌ గిలెస్పీలతో కలిసి పాంటింగ్‌ పనిచేయనున్నాడు.

ఫిబ్రవరి 17 నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 17న మెల్ బోర్న్‌లో జరగనుండగా, ఫిబ్రవరి 20న గీలాంగ్, ఫిబ్రవరి 22న అడిలైడ్‌లో జరగనుంది. ఇక జస్టిన్‌ లాంగర్‌‌ను చీఫ్‌ కోచ్‌గా, జాసెన్‌ గిలెస్పీ మరో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉంటారని సీఏ ప్రకటించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+