Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్: బెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?

ICC Cricket World Cup 2019 : Aaron Finch 'The Best Captain In This Tournament So Far' Says Vaughan
Aaron Finch Has Been the Best Captain in This Tournament So Far: Vaughan

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పొగడ్తల వర్షం కురిపించాడు. టోర్నీలో ఇప్పటివరకు బెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆరోన్ పించేనని కొనియాడాడు. ముఖ్యంగా బుధవారం టాంటన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ తనకు తెగ నచ్చేసిందని చెప్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని ఛేదంచే క్రమంలో పాకిస్థాన్‌ ఆటగాళ్లు సర్ఫరాజ్(40)‌, వాహబ్ రియాజ్‌(45) ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు.

ఈ ఇద్దరూ కలిసి పాక్‌ను విజయం వైపుగా నడిపిస్తున్న క్రమంలో ఆరోన్ ఫించ్ తీసుకున్న నిర్ణయం అద్భుతమని చెప్పాడు. పాక్ విజయానికి 35 బంతుల్లో 44 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. దీంతో అందరూ పాకిస్థాన్ విజయం సాధిస్తుందని భావించారు.

అయితే, మిచెల్ స్టార్క్ చేత ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో పాక్ రెండు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో వాహబ్‌ రియాజ్‌ ఆడిన బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి వికెట్‌ కీపర్‌ ఆలెక్స్‌ కారే చేతిలో పడింది. వెంటనే బౌలర్‌ అప్పీల్‌ చేసినప్పటికీ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.

ఈ సమయంలో ఆరోన్ ఫించ్ డీఆర్ఎస్ నిర్ణయంపై కాసేపు ఆటగాళ్లతో చర్చించి... 14వ సెకనులో రివ్యూకు వెళ్లాడు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే డీఆర్‌ఎస్ కోరే అవకాశాన్ని ఫించ్ కోల్పోయేవాడు. రివ్యూలో అతడు ఔట్‌గా తేలడంతో అంఫైర్ ఔట్‌గా ప్రకటించాడు.

ఆ తర్వాత రెండు పరుగులకే చివరి రెండు వికెట్లు కోల్పోవడంతో 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో "ఇప్పటివరకు జరిగిన టోర్నీలో ఆరోన్ ఫించ్ ది బెస్ట్ కెప్టెన్" అంటూ ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, June 13, 2019, 19:12 [IST]
Other articles published on Jun 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+