Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత్‌తో టెస్టులకు ఫించ్ అర్హుడే..'

Aaron Finch Deserves To Open Against India In Tests, Says Tim Paine

హైదరాబాద్: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగడానికి ఆరోన్‌ ఫించ్‌ అన్ని విధాలా అర్హుడని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైనె అన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో అరంగేట్ర టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా దిగిన ఫించ్‌ బ్యాట్‌తో రాణించాడు. రెండు టెస్టుల్లోనూ జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడి శుభారంభం ఇచ్చాడు. ఇలాంటి సమయంలో మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి ఫించ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించగలడని పైనె పేర్కొన్నాడు.

అన్ని ఫార్మాట్‌లలో అత్యుత్తమంగా ఫించ్‌:

అన్ని ఫార్మాట్‌లలో అత్యుత్తమంగా ఫించ్‌:

‘ప్రస్తుత క్రికెట్‌లో ఫించ్‌ అన్ని రకాల ఫార్మాట్‌లలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌. అతను మొదటి నుంచి ఆరో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగలడు. ముఖ్యంగా భారత్‌ వంటి జట్టుతో కఠిన టెస్టు సిరీస్‌ నేపథ్యంలో మా జట్టుకిది బాగా కలిసొచ్చే అంశం. నాకు తెలిసి ఓపెనర్‌గా దిగటానికి అతను అన్ని విధాలా అర్హుడే. కానీ ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.' అని ఆసీస్‌ టెస్టు కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

రెండు మ్యాచ్‌లలో 181పరుగులు

రెండు మ్యాచ్‌లలో 181పరుగులు

ఇటీవల పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేసిన ఫించ్‌ రెండు మ్యాచ్‌లలో 181పరుగులు సాధించాడు. మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ అతనికి మంచి రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్‌లోనూ ఫించ్‌ ఆసీస్‌కు కీలక ఆటగాడే. 46అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన ఫించ్‌ మొత్తం 1601పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలున్నాయి.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం

డేవిడ్ మిల్లర్ (108 బంతుల్లో 139; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), డుఫ్లెసిస్ (114 బంతుల్లో 125; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీలతో దుమ్మురేపడంతో.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 280/9 స్కోరుకే పరిమితమైంది.

మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్

మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్

డుప్లెసిస్, మిల్లర్.. కంగారూల బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. 16వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఈ జోడీ.. నాలుగో వికెట్‌కు 252 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ వికెట్‌కు ఆసీస్‌పై ప్రొటీస్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 నవంబరు 17న కర్రారాలో జరగనుంది. 2009 తర్వాత కంగారూల గడ్డపై సఫారీలకు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం.

Story first published: Monday, November 12, 2018, 9:40 [IST]
Other articles published on Nov 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+