Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా జట్టు తరఫున నంబర్ 3లో అతనే బరిలోకి దిగుతాడు : ఆరోన్ ఫించ్

Aaron Finch Clarified About no 3 Position, Steve smith will do that role in place of Marsh

సెప్టెంబరు 20న మొహాలీలో భారత్‌ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుండగా.. రెండోది నాగ్‌పూర్ వేదికగా.. మూడోది హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి.

గతేడాది ఆస్ట్రేలియా జట్టు తొలిసారి టీ20ప్రపంచకప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే గాయం కారణంగా మిచెల్ మార్ష్ ఆసీస్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో నంబర్ 3లో బ్యాటింగ్ చేసే మార్ష్ స్థానంలో స్మిత్‌ను ఆడించేందుకు చూస్తున్నట్లు డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఆగస్టులో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో మార్ష్ చీలమండ గాయానికి గురయ్యాడు.

'మిచెల్ మార్ష్ ఔట్ కావడంతో ఈ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ మూడో ర్యాంకులో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. స్టీవ్‌ స్మిత్ క్వాలిటీ ఏంటో మాకు తెలుసు. అతను గేమ్‌లోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. కాబట్టి అతని నైపుణ్యం, అతనిలో ఉన్న గేమ్ సెన్స్, వ్యూహాత్మక విధానాలేంటో మాకు తెలుసు. కాబట్టి జట్టు కూర్పులో అతను ఏ పాత్ర పోషించవలసి ఉన్నా, అతను దానిని చాలా పర్‌ఫెక్ట్‌గా చేయగలడని నేను అనుకుంటున్నా' అని మార్ష్ చెప్పాడు.

'జట్టులో కొంచెం మార్పులు చేర్పులుంటాయి. మా ఫోకస్ అంతా ప్రపంచ‌కప్ పైనే ఉంది. మేం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచకప్‌పైనే ఓ కన్నేసే తీసుకుంటాం. మొహాలీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు తెలుసు. బంతి ఇన్ స్వింగ్ ఎక్కువ అవుతుంది. ఏదేమైనా ఈ సిరీస్ విషయంలో మా దృష్టి సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాం.' అని తెలిపాడు.

Story first published: Monday, September 19, 2022, 15:01 [IST]
Other articles published on Sep 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+