అచ్చం సెహ్వాగ్ లాగే రనౌట్ అయిన ఫించ్.. మండిపడుతున్న ఆర్సీబీ ఫాన్స్!!

మెల్‌బోర్న్: బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతోంది. లీగ్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించగా.. అఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో హాట్‌టాపిక్ అయ్యాడు. ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ తన ప్రతాపం చూపించాడు. తాజాగా ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ పేలవ రీతిలో రనౌట్ అయ్యాడు.
బీబీఎల్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్ల మ్యాచ్ జరిగింది. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన మెల్‌బోర్న్ జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ (50: 39 బంతుల్లో 1x4, 1x6) రాణించడంతో అలవోకగా గెలిచేలా కనిపించింది. జట్టు స్కోరు 88 వద్ద ఫించ్ ఊహించని విధంగా రనౌట్ అయ్యాడు. వెస్ అగర్ వేసిన 13వ ఓవర్రెండో బంతిని ఎదుర్కొన్న ఫించ్.. షార్ట్ థర్డ్ మ్యాన్ వైపుకు షాట్ ఆడాడు.
ఫించ్ సింగిల్ కోసం పరుగెడుతూ.. క్రీజులోకి చేరుకోకుండా ఫీల్డర్‌పై దృష్టి కేంద్రీకరించాడు. ఇది గమనించిన ఫీల్డర్ రషీద్ ఖాన్ బంతిని అందుకుని నేరుగా వికెట్లను గిరాటేసాడు. దీంతో ఫించ్ రనౌట్ అయ్యాడు. ఈ వీడియోను బిగ్ బాష్ లీగ్ వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. గతంలో కూడా భారత మాజీ ఓపెనర్ వీరేందర్ రనౌట్ కూడా అచ్చం ఇలానే ఔట్ అయ్యాడు. లంక కీపర్ కుమార సంగక్కర రనౌట్ చేసాడు. ఫించ్ రనౌట్ అవ్వడంతో మెల్‌బోర్న్ 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
అరోన్ ఫించ్ పేలవ రీతిలో రనౌటవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. ఇలా అయితే ఆర్సీబీ ఎలా గెలుస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఫించ్ రాకతో జట్టులో బలం చేకూరిందని ఆర్సీబీ ఇటీవల అన్న విషయం తెలిసిందే. 2020 సీజన్ వేలంలో రూ. కోటి కనీస ధరతో వచ్చిన ఫించ్‌ని బెంగళూరు ఫ్రాంఛైజీ.. ఏకంగా రూ. 4.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications