Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవర్‌లో 30 పరుగులు: ఆరోన్ ఫించ్ విధ్వంసం (వీడియో)

హైదరాబాద్: క్రికెట్‌లో టీ20 మ్యాచ్‌లు వచ్చిన తర్వాత ఆటగాళ్ల బ్యాటింగ్ స్టయిలే మారిపోయింది. హాఫ్ సెంచరీలు.. సెంచరీలు కంటే.. ఒక ఓవర్‌లో హిట్టింగ్‌తో ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన చివరిదైన మూడో టెస్టులో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్‌లో 4, 4, 6, 6, 6, 0తో చెలరేగి 26 పరుగులు పిండుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అరోన్ ఫించ్ కూడా ఇదే తరహాలో ఒకే ఓవర్‌లోనే 30 పరుగులు పిండుకుని సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 నాట్‌వెస్ట్ బ్లాస్ట్‌మ్యాచ్‌లో భాగంగా డేవిడ్ వైస్ బౌలింగ్‌లో అరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Aaron Finch blasts 30 runs in an over in NatWest T20 Blast

దీంతో ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ మెరుపు సెంచరీ చేశాడు. సర్రే తరుపున ఆడుతున్న ఆరోన్ ఫించ్ ఆదివారం ససెక్స్‌తో ది ఓవల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ 64 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 114 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు రాబట్టిన ఫించ్ఆపై వరుసగా 6, 6, 6, 6, 4 బాదేసి ఔరా అనిపించాడు.

ఫించ్ సెంచరీతో చెలరేగడంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో సర్రే 17 పరుగులతో విజయ సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+