టీ20 వరల్డ్ కప్‌లో ఆడటం కుదరదని.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ బ్యాటర్!

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే టీ20 ఫార్మాట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గతేడాది స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు..
తన టైటిల్‌ను కాపాడుకోలేకపోయింది. కనీసం నాకౌట్స్ కూడా చేరుకోలేకపోయింది.

వచ్చే వరల్డ్ కప్‌లో నో ఛాన్స్..
ఈ టోర్నీలో ఫించ్ కూడా అంత గొప్పగా రాణించలేదు. దీంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు లేవనెత్తారు కొందరు. దీని గురించి అప్పట్లో మాట్లాడిన ఫించ్.. బిగ్ బ్యాష్ లీగ్ ఆడతానని, ఆ తర్వాత తన కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. '2024లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో నేను ఆడబోనని నాకు అర్థమైంది. ఆ టోర్నీకి జట్టు సిద్ధమవ్వాలంటే నేను ఇప్పుడే జట్టు నుంచి తప్పుకోవడం కరెక్ట్ అనిపించింది. ఈ సందర్భంగా నా భార్య అమీ, సహచర ఆటగాళ్లు, క్రికెట్ ఆస్ట్రేలియా తదితరులందరూ నాకు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు' అని ఫించ్ చెప్పాడు.

రెండు వరల్డ్ కప్‌లు..
టీ20 క్రికెట్‌లో అత్యద్భుతమైన ఆటగాళ్లలో ఫించ్ ఒకడు. 2011లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన అతను.. తన కెరీర్‌లో 8804 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్లలో ఫించ్ ఒకడు. జింబాబ్వేపై అతను కేవలం 76 బంతుల్లోనే 176 పరుగులు చేశాడు. 2015 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన ఫించ్.. తన కెప్టెన్సీలో ఆసీస్‌కు 2021లో తొలి టీ20 వరల్డ్ కప్ అందించాడు. గతేడాది వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఫించ్.. తను ఆడిన చిట్టచివరి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 63 పరుగులతో రాణించాడు.

అదే నాకు దక్కిన గౌరవం..
'జట్టు సక్సెస్ కోసమే ఈ ఆట ఆడతాం. 2021లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడం, 2015లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ నెగ్గడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలు. ఆస్ట్రేలియా జట్టుకు 12 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించడం, క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఆటగాళ్లు అయిన కొందరితో కలిసి, కొందరికి ప్రత్యర్థిగా ఆడటం నాకు దక్కిన అత్యంత గొప్ప గౌరవం' అని ఫించ్ తన రిటైర్‌మెంట్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. అలాగే తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా తనకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications