హైదరాబాద్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాటకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ బాడీలో మంచి గ్రేస్ ఉంటుందని, అతడు డ్యాన్స్ బాగా చేస్తాడని జట్టులోని అతడి సహచరులు చెప్పడం గతంలో మనం చూశాం. కాగా, యువీ రిసెప్షన్‌లో తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి కోహ్లీ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
దీపావళి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హోస్ట్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా జీ టీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆదివారం ప్రసారమైన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమీర్ ఖాన్‌తో కలిసి సల్మాన్ ఖాన్ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు.
ఈ వీడియోలో వీరిద్దరూ పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 'నేను 12వ తరగతి కూడా కంప్లీట్ చేయలేదు. 11 పాసవ్వగానే భారత్ తరఫున అండర్-19 జట్టులో ఆడేందుకు అవకాశం వచ్చింది' అని కోహ్లీ తన ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు.
అనంతరం ఆమీర్ ఖాన్ నటించిన 'రంగ్ దే బసంతి'లోని టైటిల్ సాంగ్‌తో పాటు సల్మాన్ నటించిన 'రెడీ' సినిమాలోని 'దింక చిక దింక చిక' పాటకు ఆమీర్‌తో కలిసి కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.