సరిగ్గా బ్యాటింగ్, బౌలింగ్ చేయలేని అఫ్రిదిని ఎంపిక చేసి ఘోర తప్పిదం చేశారు: అమీర్ సోహైల్

కరాచీ: సరిగ్గా బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయలేని షాహిద్ అఫ్రిదిని 1999 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసి టీమ్‌మేనేజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా దారుణంగా విఫలమైన అఫ్రిదిని ఓపెనర్‌గా ఆడించి భారీ మూల్యమే చెల్లించుకుందని గుర్తు చేశాడు. ఇక ఆ మెగాటోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను కెప్టెన్‌గా ఉంటే అఫ్రిదిని ఖచ్చితంగా ఓపెనర్‌గా బరిలోకి దింపేవాడిని కాదని, రెగ్యూలర్ ఓపెనర్ అయిన మహ్మద్ యూసఫ్‌ను ఆడించేవాడినని అమీర్ సోహైల్ తన యూట్యూబ్ చానెల్‌లో పేర్కొన్నాడు.

దారుణంగా విఫలం..

దారుణంగా విఫలం..

‘దురదృష్టవశాత్తు అఫ్రిదిని ఓపెనర్‌గా ఆడించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బౌలర్లపై దాడికి దిగి వారిపై ఒత్తిడినెలకొనేలా చేస్తాడని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. అతను కనీసం బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయకుండా దారుణంగా విఫలమయ్యాడు. వసీం అక్రమ్ బదులు నేనే కెప్టెన్‌గా ఉంటే మాత్రం మహ్మద్ యూసఫ్‌ను ఓపెనర్‌గా ఆడించేవాడిని.'అని సోహైల్ గుర్తు చేసుకున్నాడు. ఇక మెగాటోర్నీలో అఫ్రిది చాలా దారుణంగా విఫలమయ్యాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 13.28 సగటుతో 93 రన్స్ మాత్రమే చేశాడు.

లోకల్ టీమ్‌లా..

లోకల్ టీమ్‌లా..

ఇక ఆ టోర్నీలో ఫైనల్ చేరిన పాక్ జట్టు.. లోకల్ టీమ్‌లా ఆడిందని సోహైల్ విమర్శించాడు. ఆ సమయంలో జట్టు నిర్ణయాల విషయంలో మేనేజ్‌మెంట్ జోక్యం చేసుకుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ‘ఆ ప్రపంచకప్‌‌లో పాక్ ఓటమికి రెండు కారణాలున్నాయి. ఒకటి టీమ్ సమతూకంగా లేకపోవడం. రెండోది ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం. నా అనుభవపూర్వకంగా నేను గ్రహించిందేంటంటే.. ఆ టోర్నీ ఆసాంతం మన జట్టు ఓ లోకల్ టీమ్‌లా ఆడింది. ప్రతీ మ్యాచ్‌కు బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తు బరిలోకి దిగాం.

 పెద్దల మాటను పట్టించుకోకుండా..

పెద్దల మాటను పట్టించుకోకుండా..

ఇక ఫైనల్లో లండన్ పరిస్థితులను, సీనియర్ల సూచనలు పట్టించుకోకుండా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సలీమ్ మాలిక్.. వసీం అక్రమ్‌కు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవద్దని ముందే చెప్పాడు. కఠినమైన పిచ్‌లో బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆసీస్‌ను ఎదుర్కోలేమని చెప్పాడు. అదే బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేస్తే మన బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారని సూచించాడు. కానీ వసీం అతని మాటలను పట్టించుకోలేదు'అని పాకిస్థాన్ తరఫున22 వన్డేలు, 6 టెస్ట్‌లు ఆడిన సోహైల్ గుర్తు చేసుకున్నాడు.

 చిత్తుగా ఓడి..

చిత్తుగా ఓడి..

ఇక నాటి ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 39 ఓవర్లలో 132 రన్స్‌కు కుప్పకూలింది.ఎక్స్‌ట్రాలు 25 పరుగులే పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ కావడం గమనార్హం. న్ వార్న్(4/33), మెక్‌గ్రాత్(2/13) పాక్ పతనాన్ని శాసించారు. అనంతరం ఆసీస్ 20.1 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 133 పరుగులతో లక్షాన్ని అందుకొని విశ్వవిజేతగా నిలిచింది. గిల్‌క్రిస్ట్ (54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

కుంబ్లే, అజయ్ జడేజాను కాదని గంగూలీని కెప్టెన్ చేయడానికి తెగకష్టపడ్డాం: మాజీ సెలెక్టర్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 23, 2020, 14:55 [IST]
Other articles published on Jul 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X