Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానె ఫామ్‌పై ఇద్దరు మాజీ క్రికెటర్ల ట్వీట్ల దుమారం

Aakash Chopra, Vinod Kambli engage in Twitter war over Ajinkya Rahane's form

హైదరాబాద్: చాలా చురుకుగా తెలివిగా ఆడే ఆటగాళ్లలో రహానే ఒకరు. ఇతను విదేశీ పిచ్‌లపై ప్రదర్శించే తీరు చాలా నాణ్యతతో కూడి ఉంటుంది. కానీ, రహానె కొంతకాలంగా ఫామ్‌లో లేడు. మొన్నా మధ్య మళ్లీ పాత స్థాయిలోనే క్రీజులో ఉండి ఎక్కువ పాయింట్లు రాణిస్తాడనుకున్నారు. ఆ నమ్మకంతోనే శ్రీలంక-భారత్ టెస్ట్ మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. కేవలం పది పరుగుల వ్యక్తిగత స్కోరుతో సరిపెట్టుకున్నాడు.

అయితే ఈ మ్యాచ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్‌‌లో రహానెను సమర్థించారు. ఆ ట్వీట్ "గుడ్ ఆన్ ఇండియా టు సెండ్ రహానె ఎట్ 3.. మస్ట్ గెట్ సమ్ రన్స్ బిఫోర్ బోర్డింగ్ ద ఫ్లైట్ టు సౌత్ ఆఫ్రికా' కు స్పందించిన వినోద్ కాంబ్లి ఎలా ఆడగలడని అనుకుంటున్నావ్. అని ప్రశ్నించారు. దానికి బదులివ్వలేదని మళ్లీ మళ్లీ ట్టీట్ చేసి అడుగుతూనే ఉన్నారు. ఈ సంభాషణ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది.

'రహానెను మూడో స్థానంలో పంపి మంచి పని చేశారు. మున్ముందు వెళ్లాల్సిన దక్షిణాఫ్రికా టూర్ కంటే ముందే రహానె మంచి స్కోరు సాధించగలడు' అని ఆకాశ్ చోప్రా ట్వీట్‌ చేశాడు.

'మిస్టర్‌ చోప్రా, అతనెలా పరుగులు చేయగలడు? మీరు చెప్పగలరా?' అని మొదటి రోజు, దానికి బదులివ్వకపోవడంతో 'మిస్టర్‌ చోప్రా, అతను పరుగులెలా చేస్తాడు? మీ దగ్గర పరిష్కారం ఉందా? నాకు చెప్పండి' అని రెండో రోజు, 'మిస్టర్‌ చోప్రా శుభోదయం. నా పాత ట్వీట్‌కు దయచేసి బదులివ్వండి. క్రికెట్‌ ప్రపంచం మొత్తం దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటోంది.' అని మూడో రోజు ట్వీట్ చేయడంతో ఆకాశ్ చోప్రా చివరకు బదులిచ్చాడు.

'శుభోదయం. మీరు బాగున్నారని అనుకుంటున్నాను... క్రికెట్‌ ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు మీ దగ్గర రుజువులు ఉన్నాయా? ' అని వెటకారంగా వారం తర్వాత సమాధానమిచ్చాడు.

ఆకాశ్‌ చోప్రా.. నా అసలు ప్రశ్నకు మీరింకా జవాబు ఇవ్వలేదు. అతడు ఎక్కడ, ఎలా పరుగులు చేస్తాడు?

'ఇక్కడ ట్వీట్లు చేసుకునే బదులు చర్చకు పిలుపునిచ్చి వాదన చేసుకుందాం. నా నంబర్‌ ఎక్కడ తీసుకోవాలో మీకు తెలుసనుకుంటా..!'

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 18:22 [IST]
Other articles published on Dec 8, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+