
ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా కనిపిస్తోందని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో బరిలో దిగుతున్న సన్‌రైజర్స్ వద్ద అద్భుతమైన పేస్ బౌలర్లతోపాటు క్వాలిటీ స్పిన్నర్లు కూడా ఉన్నారని గుర్తుచేశాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జియో సినిమాలో వస్తున్న 'ఆకాష్‌వాణి' కార్యక్రమంలో ఇదే విషయాన్ని వివరించాడు. సన్‌రైజర్స్ బలం ఆ జట్టులోని పేస్ బౌలింగ్ అని అభిమానులకు ఎప్పటి నుంచే తెలుసు.
'ఈ టీం బౌలింగ్ యూనిట్ మొత్తం స్టార్లే ఉన్నారు. ఫజల్లాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ రూపంలో సూపర్ పేస్ బౌలర్లు. స్పిన్నర్ల విషయానికి వస్తే.. మయాంక్ మార్కండే, అకీల్ హొస్సేన్, వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్ ఉన్నారు' అని ఆకాష్ చోప్రా గుర్తుచేశాడు. ఈ జట్టు కావాలంటే పూర్తిగా భారత బౌలర్లతోనే బరిలో దిగే సత్తా ఉందని చెప్పాడు. ఇదే జరిగితే విదేశీ ఆప్షన్లుగా సన్‌రైజర్స్ జట్టు.. మొత్తం అందరూ బ్యాటర్లనే దింపే అవకాశం దొరుకుతుంది.
ఈ జట్టు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా చాలా బలంగా కనిపిస్తోందని ఆకాష్ చోప్రా చెప్పాడు. సన్‌రైజర్స్ బలం వారి బౌలింగే అని, దానికితోడు మొత్తం భారత బౌలర్లతోనే బరిలో దిగే అవకాశం ఉన్న ఒకే ఒక జట్టు సన్‌రైజర్స్ అని చోప్రా వివరించాడు. 'ఈ జట్టు దగ్గర నలుగురు భారత క్వాలిటీ పేసర్లు ఉన్నారు. కావాలంటే అదిల్ రషీద్‌ను ఆడించొచ్చు. లేదు.. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడాలని అనుకుంటే పూర్తిగా భారతీయ బౌలర్లను ఆడించొచ్చు' అని విశ్లేషించాడు.
నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగిని ఆడించే అవకాశం ఉందని, ఈ నలుగురూ 11 మందిలో ఆడగలిగిన సత్తా ఉన్నవాళ్లే అని చోప్రా చెప్పుకొచ్చాడు. అవసరమైతే ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ కూడా బంతితో సహకారం అందించగలరని గుర్తుచేశాడు. గతేడాది కేవలం 9 మ్యాచులే ఆడిన వాషింగ్టన్ సుందర్ కూడా ఈ సీజన్ అంతా ఆడే అవకాశం ఉందన్నాడు. భువనేశ్వర్, నటరాజన్ ఇద్దరికీ గాయాలు అవకపోతే సన్‌రైజర్స్ బౌలింగ్ పూర్తి బలంగా ఉంటుందని, ఐపీఎల్‌లో ఏ జట్టునైనా వణికించే సత్తా ఈ బౌలింగ్ యూనిట్‌కు ఉందని పేర్కొన్నాడు.