కోహ్లీ సేనను గంగూలీ టీమ్ ఓడిస్తుంది.. జట్లు ఇవే!!

ఢిల్లీ: టెస్టుల్లో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ టీమ్‌ను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సేన ఓడిస్తుందని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. రెండు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే దాదా జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువని పేర్కొన్నాడు. ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలోని టెస్ట్ జట్ల మధ్య ఊహాత్మక విశ్లేషణ చేశాడు. ఆటగాళ్ల మధ్య పోలికలు కూడా చెప్పాడు. ఇద్దరు విజయవంతమైన భారత కెప్టెన్ల టెస్ట్ జట్ల విజయాల గురించి మాట్లాడాడు.

విదేశాల్లో ఇంకా సత్తా ప్రదర్శించలేదు:
యూట్యూబ్ ఛానల్ 'ఆకాశ్ వాణి'లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. కోహ్లీ జట్టు 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనలో విజయం మినహా విదేశాల్లో ఇంకా తన సత్తా ప్రదర్శించలేదన్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో గెలవలేదని పేర్కొన్నాడు. గంగూలీ జట్టు మాత్రం ఇంగ్లండ్, పాకిస్థాన్‌లో విజయాలు నమోదు చేసిందని వెల్లడించారు. 'కోహ్లీ సేన ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఓడించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి రికార్డు కోహ్లీ జట్టుకే ఉంది. కానీ వారు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో ఓడారు. దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయానికి చేరువగా వచ్చినా.. 2-1తో కోల్పోయారు. గట్టిపోటీ ఇచ్చారు' అని ఆకాశ్ అన్నాడు.

విదేశాల్లో ఎలా గెలవాలో నేర్పించింది:
'మేం (గంగూలీ జట్టు) ఆస్ట్రేలియాకు వెళ్లి సిరీస్ డ్రా చేశాం. పాకిస్థాన్ వెళ్లి వారిని ఓడించాం. భారత్‌లో ఆసీస్‌పై ఒక సిరీస్ గెలిచి ఒకటి ఓడాం. గంగూలీ జట్టు ఇంగ్లండ్‌లోనూ ఓ సిరీస్ డ్రా చేసింది. ఇది చాలా మంచి జట్టు. విదేశాల్లో ఎలా గెలవాలో నేర్పించింది' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. అయితే మొత్తం జయాపజయాలను పరిగణనలోకి తీసుకుంటే.. కోహ్లీ సేననే మెరుగ్గా ఉందన్నాడు. కోహ్లీ సేన 33 టెస్టుల్లో గెలిచి 12 ఓడగా.. గంగూలీ జట్టు 21 గెలిచి 13 ఓడిందన్నారు.

మెరుగైన ఓపెనింగ్ కాంబినేషన్:
దాదా జట్టు కంటే కోహ్లీ జట్టు మెరుగైన ఓపెనింగ్ కాంబినేషన్ కలిగి ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వీరేందర్ సెహ్వాగ్.. రోహిత్ శర్మ కంటే కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ.. మయాంక్ అగర్వాల్ తనకంటే మంచి ఆటగాడన్నాడు. ఇక దాదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లు పటిష్టంగా ఉన్నారన్నాడు. ఇక వికెట్ కీపర్‌లు సమానం అని చెప్పాడు. స్పిన్ బౌలర్ల విషయానికొస్తే రవిచంద్రన్ అశ్విన్.. హర్భజన్ సింగ్ కంటే కొంచెం ముందున్నాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. మరోవైపు అనిల్ కుంబ్లే.. రవీంద్ర జడేజా కంటే అందనంత ఎత్తులో ఉన్నడన్నాడు. రెండు జట్లలోనూ పేస్ బాగుందని చోప్రా చెప్పుకొచ్చాడు.

సౌరవ్ గంగూలీ జట్టు:
వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, పార్థివ్ పటేల్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్.

విరాట్ కోహ్లీ జట్టు:
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ/జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications