
లక్నోకు చెమటలు
కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండడం ఐపీఎల్‌లో కొత్త ఫాంచైజీ అయినా లక్నో సూపర్ జెయింట్స్‌కు చెమటలు పట్టిస్తున్నాయని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. రాహుల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ అతని భారీ ధరకు కొనుగోలు చేసిందని అన్నాడు. కానీ వెస్టిండీస్‌తో రెండో వన్డేలో గాయపడిన రాహుల్.. టీ20 సిరీస్‌తోపాటు శ్రీలంక పర్యటనకు కూడా దూరమయ్యాడని గుర్తు చేశాడు. దీంతో అతను ఐపీఎల్ 2022లో కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడేమోననే టెన్షన్ రాహుల్‌ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌లో ఉందని అన్నాడు. దీంతో రాహుల్ ఫిట్‌నెస్ సమస్యలు లక్నోకు కచ్చితంగా చెమటలు పట్టిస్తాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

భారీ ధరకు కొనుగోలు
కాగా ఐపీఎల్ 2022లో మెగా వేలానికి ముందే కేఎల్ రాహుల్‌ను రిటెన్షన్ పద్దతిలో లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఇందుకుగాను అతనికి 17 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. గత సీజన్లలో రాహుల్ పంజాబ్ కింగ్స్ తరఫున అదరగొట్టాడు. దీంతో రాహుల్‌కు భారీ ధర వెచ్చించి జట్టులో చేర్చుకుంది. అంతేకాకుండా రాహులే తమ జట్టు కెప్టెన్ అని కూడా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రాహుల్ గాయపడడం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆందోళనలకు దారి తీస్తుంది.

లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు
కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, మార్క్ వుడ్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మనీశ్ పాండే, దుష్మాంత చమీరా, ఎవిన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్, అంకిత్ సింగ్ రాజ్‌పుత్, షాబాజ్ నదీమ్, కేల్ మయేర్స్, మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్.

వాషింగ్టన్ సుందర్ కూడా డౌటే
అలాగే గాయపడిన మరో టీమిండియా ఆటగాడు సుందర్ గురించి కూడా ఆకాశ్ చోప్రా స్పందించాడు. సుందర్ పదే పదే గాయాలపాలవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. సుందర్ టీ20 ప్రపంచకప్‌నకు ముందు చేతి వేళ్ల గాయంతో జట్టుకు దూరమయ్యాడని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు సౌతాఫ్రికా పర్యటనకు ముందు కరోనా బారినపడి ఆ పర్యటన మొత్తానికే దూరమయ్యాడని అన్నాడు. ఇప్పటికే సుందర్ రెండు సార్లు కరోనా బారిన పడ్డాడని ఆయన తెలిపాడు. ఇలా సుందర్ దీర్ఘకాలికంగా గాయాలపాలవుతున్నాడన్నాడు. తాజాగా విండీస్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన సుందర్.. టీ20 సిరీస్‌తోపాటు శ్రీలంక పర్యటకు దూరమయ్యాడనే విషయాన్ని గుర్తు చేశాడు. దీంతో వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అని మెగా వేలంలో అతన్ని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో ఆందోళన నెలకొందని చోప్రా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












