Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra: కీరన్ పొలార్డ్‌కు ఇంకెన్ని అవకాశాలిస్తారు.. అతనికి టాటా బైబై చెప్పే టైమొచ్చింది

Aakash Chopra says its time for Mumbai team to say goodbye to Pollard

ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్‌తో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. అయితే ఈ సీజన్లో మాత్రం ముంబై అత్యంత చెత్త జట్టుగా మారింది. ఈ సీజన్‌లో ముంబై తొలి ఎనిమిది మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. ఇక 9, 10 మ్యాచ్‌లను రోహిత్ సేన వరుసగా గెలుపొందింది. మొత్తం 10మ్యాచ్‌లలో ముంబై జట్టు కేవలం రెండింట మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. మిగిలిన అన్ని గేమ్‌లను గెలిచినప్పటికీ ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేదు.

దిగువ స్థానంలో ఉన్న ముంబై ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆ జట్టు మేనేజ్‌మెంట్ తదుపరి సీజన్లో తన జట్టు కూర్పు విషయం కోసం మిగతా మ్యాచ్‌ల్లో జట్టులోని ప్లేయర్ల ప్రదర్శనను అంచనా వేసేందుకు చూస్తోంది. గతవారం గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్ రోహిత్, ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి రాగా.. వరుసగా విఫలమవుతున్న ముంబై స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ ఫామ్ ముంబై జట్టుకు ఆందోళన కలిగిస్తుంది.

ఏళ్ల తరబడి ముంబై జట్టులో పాతుకుపోయాడు

ఏళ్ల తరబడి ముంబై జట్టులో పాతుకుపోయాడు

పొలార్డ్ కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్‌కు కీలకమైన ప్లేయర్‌గా ఉన్నాడు. ఫిబ్రవరిలో మెగా వేలం జరిగే ముందే అతన్ని ముంబై రిటైన్ చేసుకుంది. అయితే వెస్టిండీస్‌ ప్లేయర్ 10 మ్యాచ్‌ల్లో కేవలం 129పరుగులే మాత్రమే చేశాడు. అలాగే నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అతను గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 14బంతుల్లో కేవలం 4పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.

 పొలార్డ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను తీసుకోవాలి

పొలార్డ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను తీసుకోవాలి

పొలార్డ్ ప్రదర్శనపై మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. పొలార్డ్ స్థానంలో ముంబై జట్టు యువ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్‌కు చోటు కల్పించాలని సూచించాడు. ఇప్పటికే బ్రెవిస్ బ్యాటింగ్‌లో తన సత్తా చూపాడని గుర్తుచేశాడు. ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. అకస్మాత్తుగా ముంబై జట్టు ఇప్పుడు మంచి టచ్‌లో కన్పిస్తోంది. అయినప్పటికీ ముంబై జట్టులో ఒక మార్పు మాత్రం తప్పకుండా జరగాల్సిన సమయం ఆసన్నమైంది. కీరన్ పొలార్డ్‌ను జట్టులో నుంచి తొలగించి డెవాల్డ్ బ్రెవిస్‌ను అతని స్థానంలో తీసుకోవాలి.

పొలార్డ్‌కు టాటా చెప్పేయొచ్చు

పొలార్డ్‌కు టాటా చెప్పేయొచ్చు

'పొలార్డ్‌కి ముంబై జట్టు ఎన్ననీ అవకాశాలు ఇస్తుందీ? అతను అసలు రన్స్ ఏమాత్రం చేయడం లేదు. అతని బౌలింగ్ కాస్త ఉపయోగకరంగా ఉంటుంది కానీ అతన్ని బౌలింగ్ కోసం జట్టులోకి ఎంపిక చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి పొలార్డ్‌కు టాటా బై-బై చెప్పే సమయం వచ్చిందని భావిస్తున్నాను' అని చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ముంబై రెండు విజ‌యాలు సాధించడాన్ని ప్రశంసించాడు. నిరాశజనకంగా మారిన ముంబై ప్రదర్శనతో సతమతమవుతున్న తరుణంలో ఈ రెండు విజయాలు పాజిటివ్ వైపు ఆ జట్టు మళ్లేలా చేశాయి కానీ ముంబై జట్టు గరిష్ఠంగా 12పాయింట్లను మాత్రమే పొందగలదు. ఇక ప్లేఆఫ్ రేసులో నిలవడానికి కావాల్సిన తొలి నాలుగు స్థానాల్లో నిలవడానికి ఆ పాయింట్లు ఏమాత్రం సరిపోవు.' అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ముంబై జట్టు మునుపటి కంటే మంచి టచ్‌లో కన్పిస్తుంది

ప్రస్తుతం ముంబై జట్టు మునుపటి కంటే మంచి టచ్‌లో కన్పిస్తుంది

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ గత గేమ్‌లో కొంత ఫామ్‌ అందిపుచ్చుకున్నారు. వారు రన్స్ చేయొచ్చని ఆశించొచ్చు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ టోర్నమెంట్‌లో చాలా బాగా రాణిస్తున్నారు. టిమ్ డేవిడ్ లోయర్ ఆర్డర్లో సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ఇక బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, డేనియల్ సామ్స్ , రిలే మెరెడిత్‌ రాణిస్తున్నారు. ప్రస్తుతం ముంబై జట్టు చాలా బాగా కన్పిస్తోంది. ఈ టోర్నమెంట్‌ ఫస్టాఫ్‌లో ముంబై అలా కన్పించలేదు' అని చోప్రా తెలిపారు.

Story first published: Monday, May 9, 2022, 18:15 [IST]
Other articles published on May 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+