For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదు.. రైనా తొందరపడ్డాడు'

Aakash Chopra says I think Suresh Raina could have been handled a lot better

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఈ నెల15న అంతర్జాతీయ క్రికెట్‌కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. రిటైర్మెంట్ ప్రకటించి మూడురోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆ విషయం గురించే చర్చంతా నడుస్తున్నది. రైనా వీడ్కోలుపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. రైనా లాంటి ఆటగాడు 33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదని, అదసలు రిటైర్మెంట్‌ వయసే కాదన్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రైనాను ఏ స్థానంలో పంపించినా జట్టుకు విజయాలే అందించాడని, అయితే అతడికి సరైన అవకాశాలు రాలేదని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు.

సరైన అవకాశాలు రాలేదు:

సరైన అవకాశాలు రాలేదు:

తాజాగా వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ... 'సురేశ్‌ రైనా భారత ఎడమ చేతివాటం క్రికెటర్లలో గొప్ప ఆటగాడు. రైనాకు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కలేదు. జట్టు యాజమాన్యం ఎక్కడ ఆడించినా విజయాలే అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో యువీకి తోడుగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడికి సరైన అవకాశాలు రాలేదు. భారత్‌ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది' అని అభిప్రాయపడ్డాడు.

33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదు:

33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదు:

'సురేష్ రైనా లాంటి ఆటగాడు 33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదు. అదసలు రిటైర్మెంట్‌ వయసే కాదదు. రాబోయే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. అలాంటి స్థితిలో అతడు కొనసాగాల్సింది. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌ రైనా. అతడి తర్వాతే కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదారు. ఈ జాబితాలోకి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇంకా చేరలేదు. ఇక ఫీల్డింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లోనూ రైనా అద్భుతంగా రాణించాడు. భారత గొప్ప ఫీల్డర్లలో అతడొకడు' అని ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్‌ తెలిపాడు.

రైనా తొందరపడ్డాడు:

రైనా తొందరపడ్డాడు:

ఇటీవల నాతొ పాల్గొన్న ఇంటర్వ్యూలోనూ సురేష్ రైనా మళ్లీ భారత జట్టుకు ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పడు ఇలా చేశాడు. రైనా తొందరపడ్డాడు అని నా అభిప్రాయం' అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. అయితే రైనా రిటైర్మెంట్‌ పట్ల బాధపడాల్సిన పనిలేదని, దాన్ని సంతోషంగా స్వీకరించాలని చోప్రా చెప్పుకొచ్చాడు. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన సురేష్ రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, August 19, 2020, 10:05 [IST]
Other articles published on Aug 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+