For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra: టీమిండియాలో అతను లేకుంటే జట్టు ప్లాన్స్ అన్ని చెడిపోతాయి

Aakash Chopra Said that If Hardik Pandya Unavailable Team Plans Are Neverthless

భారత జట్టుకు సమతూకం తేస్తున్న ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్యా అని.. అతను జట్టులో లేకుంటే అన్ని ప్లాన్లు డిస్ట్రబ్ అయిపోతాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌‌కు హార్దిక్ పాండ్యా టైటిల్‌ అందించిన సంగతి తెలిసిందే. 2022 ఏడాది హార్దిక్ కెరీర్లోనే అత్యుత్తమ ఏడాది అని చెప్పుకోవచ్చు. అతను ఐపీఎల్లో సక్సెస్ తర్వాత దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ పర్యటనలో కూడా రాణించాడు. ఐర్లాండ్ పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ పర్యటనలోనూ, వెస్టిండీస్‌ పర్యటనలోను మంచి ఫామ్‌ను కొనసాగించాడు. 28ఏళ్ల హార్దిక్ ఇటీవల కేవలం బౌలింగ్లోనే కాదు బౌలింగ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చుతున్నాడు. తద్వారా భారత జట్టుకు అతను కీలక ప్లేయర్‌గా మారాడు.

ఇక ఆకాష్ చోప్రా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. జట్టులో సమతుల్యం తెచ్చే నిఏకైక ఆటగాడు పాండ్యా అన్నాడు. అతను లేకుంటే అన్ని ప్రణాళికలు చెడిపోతాయన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వారికి ప్రత్యామ్నాయాలను భారత టీం కనుగొనగలిగినప్పటికీ పాండ్యా విషయంలో ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నాడు.

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia

'హార్దిక్ 4ఓవర్లు బౌలింగ్ చేయడం ఒక ఇన్సురెన్స్ పాలసీ లాంటిది. అతను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అందులో డౌట్ లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. జట్టులో హార్దిక్ పాండ్యా ఉంటేనే జట్టుకు సమతూకం ఉంటుంది. అతను లేకపోతే జట్టు వేసుకున్న అన్ని ప్లాన్స్ చెడిపోతాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లకు కూడా ప్రత్యామ్నాయ ఆటగాళ్లు దొరుకుతారు కానీ హార్దిక్ పాండ్యా లేకపోతే సమతూకమైన ప్లేయింగ్ 11ను టీమిండియ జట్టు తయారు చేయలేదు' అని చోప్రా అన్నాడు. ఆసియా‌కప్ టైంలో భారత్ పాండ్యాను చాలా తెలివిగా ఉపయోగించుకోవాలని చోప్రా చెప్పాడు.

Story first published: Friday, August 12, 2022, 18:00 [IST]
Other articles published on Aug 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+