టీమిండియా అసలు సమస్య అదే.. అందుకే ఈ ఓటములు: ఆకాశ్ చోప్రా

సిడ్నీ: ఆసీస్ గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు ముగిశాయి. రెండు వన్డేల్లోనూ పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. సిరీస్‌ని 0-2తో కంగారూలకి సమర్పించుకుంది. ఇక నామమాత్రమైన ఆఖరి వన్డే బుధవారం జరగనుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ముందుగా బౌలర్లు చేతులెత్తేయగా.. ఛేదనలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు పూర్తిగా నిరాశపరిచారు. వన్డే సిరీస్ పోయినా.. మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో.. టీమిండియా తప్పిదాల్ని దిద్దుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

కొత్త బంతితో తేలిపోతున్నారు:

కొత్త బంతితో తేలిపోతున్నారు:

గత కొన్ని మ్యాచ్‌లుగా కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీయలేకపోతున్నారని, అదే టీమిండియా అసలు సమస్య అని.. అంతేకాని ఆల్‌రౌండర్‌లు లేని లేటు మాత్రం కాదని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ... 'టీమిండియా బౌలింగ్‌ని ఓసారి పరిశీలిస్తే.. గత కొన్ని మ్యాచ్‌లుగా కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీయలేకపోతున్నారు. చివరిగా ఆడిన మూడు వన్డేల్లోనూ ప్రత్యర్థి జట్టు తొలి వికెట్‌కి 100 పరుగుల పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పింది. అంటే మన బౌలింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు' అని అన్నాడు.

పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతే:

పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతే:

'తొలి 20 ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడదీయలేకపోతే.. ఆ తర్వాత ఎవరు బౌలింగ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో హార్దిక్ పాండ్యా మధ్య ఓవర్లలో బౌలింగ్ చేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అయినప్పటికీ అతను సెంచరీతో జోరుమీదున్న స్టీవ్‌ స్మిత్‌ని ఔట్ చేశాడు. కానీ మొదటి పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతే.. టీమ్‌లో ఎన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి ఆరంభంలో వికెట్లు తీయలేకపోవడమే ఇప్పుడు టీమిండియా అసలు సమస్య' అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.

రోహిత్ సపోర్ట్ కావాలి:

రోహిత్ సపోర్ట్ కావాలి:

'రెండు వన్డేల్లోనూ స్కోర్ బోర్డుపై భారీ స్కోరు ఉండటంతో భారత బ్యాటింగ్ లైనప్‌లో కాస్త కంగారు కనిపించింది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టులో ఉండిఉంటే.. ధైర్యంగా ఉండేది. అంతేకాదు ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడేది. కానీ ఇప్పుడు అతను జట్టులో లేడు. టీమిండియా 350 పైచిలుకు స్కోరు చేయాలంటే.. రోహిత్ సపోర్ట్ కావాలి. అలానే 350+ ఛేదనలోనూ జట్టుకి అతని సాయం అవసరం' అని చోప్రా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020‌లో గాయపడిన రోహిత్‌ను వన్డే, టీ20 సిరీస్‌కి బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయని విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు.

బుమ్రాతో 2 ఓవర్లే:

బుమ్రాతో 2 ఓవర్లే:

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో కేవలం రెండు ఓవర్లు స్పెల్ మాత్రమే జస్ప్రీత్ బుమ్రాతో వేయించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నవదీప్ సైనీ, మహ్మద్ షమీలతో ప్రయోగం చేశాడు. దాంతో వికెట్ టేకింగ్ బౌలర్‌ని ఫస్ట్ పవర్‌ ప్లేని పక్కన పెట్టడం ఆస్ట్రేలియాకి కలిసొచ్చిందని మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా తదితరులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. కోహ్లీ నాయకత్వంపై వారు పెదవి విరిచారు.

కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. నన్ను నిద్ర లేపు నాన్నా!! మైకెల్ వాన్ షాక్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, December 1, 2020, 14:57 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X