Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపక్ హుడాను ఆ స్థానంలో ఫిక్స్ చేయాలి : ఆకాష్ చోప్రా

Aakash Chopra Reckons that Deepak Hooda should play at No.3

భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టీ20 కోసం తన ప్లేయింగ్ 11ను ఎంచుకున్నాడు. దీపక్ హుడాను నం 3 బ్యాటర్‌గా కొనసాగించాలని ఆకాశ్ చోప్రా నొక్కి వక్కాణించాడు. ఇటీవల రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దీపక్ హుడా ఐర్లాండ్‌తో అద్భుతమైన ఆటతీరును కనబర్చిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌తో రెండో టీ20లో అతను సెంచరీ కూడా చేశాడు. మొదటి మ్యాచ్‌లో అతను 29బంతుల్లో 47పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఐర్లాండ్ సిరీస్లో హుడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.

దీపక్ హుడా స్థానంలో ఎలాంటి మార్పులొద్దు

దీపక్ హుడా స్థానంలో ఎలాంటి మార్పులొద్దు

దీపక్ హుడా గురించి ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి టీ20 కోసం టీమిండియా నంబర్ 3బ్యాటింగ్ పొజిషన్లో హుడాను కొనసాగించాలని స్పష్టం చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్ స్టార్ బాగా ఆడినందున అతని స్థానంలో ఎలాంటి మార్పులు చేయదలచుకోలేదని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక తన ప్లేయింగ్ 11లో అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్‌లను ఇద్దరు స్పిన్నర్లుగా ఉపయోగించాలని సూచించాడు. ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌లను పక్కన పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని, రోహిత్, ఇషాన్ బరిలోకి దిగుతారని పేర్కొన్నాడు.

వరుసగా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్

వరుసగా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్

ఇంకా మాట్లాడుతూ.. 'నేను నంబర్ 4స్థానంలో సూర్యకుమార్‌ను ఆడించాలనుకుంటున్నాను. నంబర్ 5గా హార్దిక్ పాండ్యా, నంబర్ 6గా దినేష్ కార్తీక్ ఆడతారు. అక్షర్ పటేల్ చివరి మ్యాచ్, అంతకు ముందు సిరీస్‌లో ఆడాడు. అతను మళ్లీ నంబర్ 7లో రావాలని కోరుకుంటున్నాను. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరు స్పిన్నర్లుగా ఉంటారు. హర్షల్ పటేల్, అవేష్ ఖాన్ భువనేశ్వర్ కుమార్‌లు పేసర్‌లుగా ఎంపిక చేసుకున్నాను.' అని చోప్రా పేర్కొన్నాడు. ఇకపోతే తొలి టీ20కి రీషెడ్యూల్డ్ టెస్ట్ ఆడిన సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా తదితరులు దూరమయ్యారు.

తొలి టీ20కి భారత జట్టు:

తొలి టీ20కి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Thursday, July 7, 2022, 21:59 [IST]
Other articles published on Jul 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+