Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra: RCBకి మరో కొత్త ఆయుధం దొరికింది

మరో అయిదు రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. 16 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన టైటిల్ కలను ఈ సారి అయినా దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కసిగా బరిలోకి దిగుతుంది. మార్చి 22న చెపాక్ వేదికగా ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బెంగళూరు జట్టు గురించి మాట్లాడాడు. ఆటగాళ్ల బలాబలాల గురించి విశ్లేషించాడు. విదేశీ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్ రాకతో ఆర్సీబీ బలోపేతంగా మారిందని అన్నాడు. గ్రీన్ ఆర్సీబీకి దొరికిన మరో అస్త్రమని పేర్కొన్నాడు. ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్ నుంచి గ్రీన్ ఆర్సీబీ జట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Aakash Chopra RCB got another new weapon in IPL 2024

''ఆర్సీబీ జట్టులో బ్యాకప్‌గా విల్ జాక్స్ కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ల వద్ద ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఆర్సీబీలో టాప్ 5-6లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. డుప్లెసిస్, విరాట్ కోహ్లి గత సీజన్‌లో నిలకడగా పరుగులు సాధించారు. మాక్స్‌వెల్ కూడా ఇప్పుడు నిలకడగా ఆడుతున్నాడు. మాక్సీ గొప్ప ప్లేయర్. ఇంకా బెంగళూరులో గ్రీన్ కూడా వచ్చాడు. అతడో గన్ లాంటి వాడు''

''ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. మొదట డుప్లెసిస్, కోహ్లి వస్తారు. ఆ తర్వాత మాక్స్‌వెల్ లేదా రజత్ పటిదార్‌తో కామెరూన్ రంగంలోకి దిగుతాడు. ఈ అయిదుగురు గన్ బ్యాటర్స్. టెస్టుల్లో రజత్ పటిదార్ ఫామ్‌లో లేడని అనుకోవచ్చు. అది పెద్ద విషయమేమికాదు. చిన్నస్వామి స్టేడియంలో అడుగుపెడితే ఫామ్‌ను తిరిగి పొందుతారు'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

అయితే ఆర్సీబీ బౌలింగ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జట్టులో ఎవరూ లేరు. ఆఖర్లో ఫెర్గూసన్‌తో బంతిని ఎవరు అందుకుంటారనేది అసలు ప్రశ్న. వేలంలో రూ.11.50 కోట్లు కుమ్మరించి తీసుకున్న అల్జారి జోషెఫ్‌ కొత్తబంతితో పవర్‌ప్లేలో సత్తాచాటుతాడు. సిరాజ్ కూడా కొత్తబంతితో చెలరేగే ఫాస్ట్ బౌలర్. మరి చివర్లో ప్రత్యర్థి స్కోరుబోర్డును కంట్రోల్ చేసే ఆర్సీబీ బౌలర్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. బెంగళూరు స్పిన్‌ కూడా బలహీనంగా ఉంది.

ఆర్సీబీ: డుప్లెసిప్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తీక్‌, విల్‌ జాక్స్‌, టామ్‌ కరన్‌, టాప్లీ, ఫెర్గూసన్‌, అల్జారి జోసెఫ్‌ మహ్మద్ సిరాజ్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, అనూజ్‌ రావత్‌, యశ్‌ దయాల్, ఆకాశ్‌ దీప్‌, సౌరభ్‌ చౌహాన్‌, లొమ్రార్‌, కర్ణ్‌ శర్మ, స్వప్నిల్‌ సింగ్‌, మయాంక్‌ దాగర్‌, మనోజ్‌ భండగె, హిమాంశు శర్మ, వైశాఖ్‌, రాజన్‌ కుమార్‌

Story first published: Sunday, March 17, 2024, 18:35 [IST]
Other articles published on Mar 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+