Aakash Chopra: సెలెక్షన్ కమిటీకి సమస్యేంటి..? ఆకాష్‌చోప్రా సూటి ప్రశ్నలు.. అన్ని తెలిసి కూడా ఇలాగేనా?

ఆసియా కప్ కోసం సెలెక్షన్ కమిటీ ప్రకటించిన భారత జట్టు ఎంపికను భారత మాజీ ప్లేయర్, విశ్లేషకుడు, కామెంటేటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. జట్టులో కేవలం ముగ్గురు పేసర్లను మాత్రమే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు. ఆగస్ట్ 27న ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. జట్టులో పేసర్ మహమ్మద్ షమీని తీసుకోవాల్సిందని తన ఒపినియన్ వెల్లడించాడు. 15మంది సభ్యులతో కూడిన జట్టులో షమీ కచ్చితంగా ఉండాల్సినవాడని అభిప్రాయపడ్డాడు. సెలెక్షన్ కమిటీ ప్రకటించిన భారత్ జట్టులో ఫాస్ట్ బౌలర్లుగా అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ సెలెక్ట్ అయ్యారు.

దుబాయ్ పిచ్‌ల గురించి తెలిసి కూడా
ఇకపోతే అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ జట్టుకు తప్పకుండా ఎంపిక కావాల్సినవారేనని చోప్రా అభిప్రాయపడ్డాడు. మూడో పేసర్ విషయంలో అవేష్ ఖాన్‌ను తీసుకోవాలా లేదా షమీని తీసుకోవాలా అనే డైలామా నెలకొని ఉండొచ్చని పేర్కొన్నాడు. జట్టుకు నలుగురు పేసర్లు అవసరమని భావించి అవేశ్ ఖాన్, షమీ ఇద్దరినీ ఎంపిక చేసి ఉండాల్సిందని తెలిపాడు. ‘నా ప్రశ్న ఏమిటంటే.. దుబాయ్‌లలో సెప్టెంబర్ నెలలో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనకూలిస్తుంది. పిచ్‌పై చాలా గ్రాస్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ మొత్తానికి పిచ్ మారే అవకాశమే లేదు. ఫాస్ట్ బౌలర్లకు తప్పకుండా స్థిరమైన సహకారం అందుతుంది. 2021 ఐపీఎల్‌లో మనం ఫాస్ట్ బౌలర్లకు పిచ్ ఎలా అనుకూలిస్తుందో మనం చూసే ఉన్నాం. అందువల్ల నలుగురు పేసర్లను తీసుకోవడంలో సెలెక్షన్ కమిటీకి కలిగిన సమస్య ఏమిటి?' అన్ని తెలిసి కూడా ఇలా చేశారేంటో అంటూ తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ పేర్కొన్నాడు.

పెద్దగా ఆకట్టుకోకున్నా అవేష్ ఖాన్ ఎంపిక
ఇకపోతే జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న ఇతర ఫాస్ట్ బౌలర్లలో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా కీలకమైనవారు కానీ.. హర్షల్ పటేల్ సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడుతుండగా.. బుమ్రా వెన్ను గాయంతో ఇబ్బంది పడడంతో వీరిద్దరు జట్టుకు దూరమయ్యారు. వీరు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. తద్వారా అవేశ్ ఖాన్‌కు లక్కీగా చోటు దక్కింది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ మినహా మిగతా మ్యాచుల్లో అవేశ్ ఖాన్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. అయినా గానీ అతనికి జట్టులో చోటు లభించింది.


ఐపీఎల్లో చూశారుగా మరీ ఇంకేంటీ?
ఇక ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. ‘మహ్మద్ షమీ జట్టులో ఎందుకు లేడు. ఒక్క స్థానం కోసం అవేష్ ఖాన్, మహ్మద్ షమీ మధ్య ఇది పోటీ అని నేను భావించను. కానీ నా ప్రకారం నలుగురు ఫాస్ట్ బౌలర్లు అవసరం కాబట్టి మీరు వారిద్దరినీ ఎంపిక చేయాల్సింది.' ఆకాష్ చోప్రా అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో షమీ ప్రదర్శన తీరును కూడా ఆకాష్ ప్రస్తావించాడు. ఐపీఎల్ బేస్డ్‌గా అయినా షమీకి చోటు దక్కాల్సిందని, అతని అనుభవం ఉపయోగపడేదని నొక్కి వక్కాణించాడు. ఇకపోతే ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున 8.00ఎకానమీ రేట్‌తో 16గేమ్‌లలో షమీ 20వికెట్లు తీసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications