For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra: టీమిండియా జట్టులో ఉన్న యువకుల్లో అతనే మెచురిటీ ఉన్న కెప్టెన్

Aakash Chopra Praises that Hardik Pandya is the Mature captain among younger lot

హార్దిక్ పాండ్యాపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్న యువకులలో అత్యంత పరిణతి చెందిన కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సంచలనాత్మక ఫామ్‌ కనబర్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే తన జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్‌గాను హార్దిక్ రికార్డులకెక్కాడు. ఇకపోతే ఈ నెల చివర్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా టీ20జట్టుకు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ ప్రకటించింది. బుధవారం 17మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలను చూపించాడు.

ఇక ఐర్లాండ్ పర్యటనలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, పేసర్ భువనేశ్వర్ కుమార్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. టీమిండియా జూన్ 26, 28వ తేదీల్లో డబ్లిన్‌లో రెండు టీ20లు ఆడనుంది. 'రైజ్ అండ్ రైజ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. అతను కేవలం ఐపీఎల్లో ఒకే సీజన్‌కు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ కెప్టెన్సీ పరంగా ప్రస్తుతం ఉన్న యువ ప్లేయర్లలో అతను చాలా పరిణతి చెందిన కెప్టెన్ అని నేను భావిస్తున్నా. ఐర్లాండ్ జట్టుకు అతను కెప్టెన్‌గా ఎంపిక అవడం పట్ల అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీమిండియాకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న హార్దిక్ పాండ్యా తన తొలి అసైన్‌మెంట్లో విజయవంతం కావాలని ఆశిస్తున్నా' అని ఆకాష్ చోప్రా ప్రత్యేకంగా కూ యాప్‌లో తెలిపాడు.

ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహ

Story first published: Thursday, June 16, 2022, 19:11 [IST]
Other articles published on Jun 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+