Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Aakash Chopra : దినేష్ కార్తీక్ మామూలోడు కాదు.. చాలా స్పెషల్.. డీకే ఉంటే స్కోరెలా ఆగుద్ది

Aakash Chopra Praises DK Is Special Player and He Is Only Specialist Batter at 6th Position

ట్రినిడాడ్‌లోని తరౌబాలో గల బ్రియాన్ లారా స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో దినేష్ కార్తీక్ మ్యాచ్ విన్నింగ్ ఫినిషింగ్ నాక్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక డీకే బ్యాటింగ్‌ను మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా ప్రశంసించాడు. అతను మామూలు ప్లేయర్ కాదన్నాడు. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ కేవలం 19బంతుల్లో 41* పరుగులు చేశాడు. తద్వారా ఇండియా 20ఓవర్లలో 190పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ల ధాటికి వెస్టిండీస్ కేవలం 122పరుగులు మాత్రమే చేయగలగడంతో ఇండియా 67పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో కార్తీక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ.. చివర్లో దినేష్ కార్తీక్ ఆడిన నాక్ చాలా ప్రభావవంతమైనదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

దినేష్ కార్తీక్‌ ఓ ప్రత్యేక ప్లేయర్ అంటూ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఈ తమిళనాడు క్రికెటర్‌లో ఇంకా క్రికెట్ పుష్కలంగా మిగిలి ఉందని చెప్పాడు. 'నేను కూడా డీకేకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాలనుకున్నా. అనుకున్నట్లుగానే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో డీకే కన్నా రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. రోహిత్ ప్రదర్శన కీలకమైందనే విషయం చెప్పనవసరం లేదు. రోహిత్ బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడిందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. కానీ అతను ఔటయ్యాక భారత స్కోరు చాలా తక్కువకే పరిమితమైపోతుందనిపించింది. అప్పుడు డీకే స్కోరును ఓ రేంజుకు తీసుకెళ్లాడు' అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

'డీకే ఉండగా.. స్కోరు ఎందుకు ఆగిపోతుంది. డీకే ఉన్నప్పుడు భారీ స్కోరు సదా సాధ్యమే. డీకే చాలా స్పెషల్. అతనిలో క్రికెట్ చాలా మిగిలి ఉంది. వాటే ఫినిషర్, వాటే ప్లేయర్. దినేష్ కార్తీక్ చివర్లో వచ్చి మళ్లీ అలా తళుక్కున మెరిసిపోయే ఆట ఆడాడు. ప్రపంచంలో నంబర్ 6లో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఆడిన ఏకైక బ్యాటర్ డీకేనే కావచ్చు. అతను 19బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 215 స్ట్రైక్ రేట్‌తో 41పరుగులు చేశాడు. ఈసారి అతను 6వ స్థానంలో కూడా రాలేదు. 7వ స్థానంలో క్రీజులోకి వచ్చాడు. అతని కంటే ముందు జడేజా వచ్చాడు' అని చోప్రా తెలిపాడు. ఇక టీట్వంటీ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆగస్ట్ 1న సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో జరగనుంది.

Story first published: Sunday, July 31, 2022, 20:39 [IST]
Other articles published on Jul 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+