For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌ రాకపోవచ్చు.. ఒక అయ్యర్‌కే ఛాన్స్! కివీస్‌తో బరిలోకి దిగే ఆకాష్ జట్టు ఇదే!

Aakash Chopra picks his Indian playing XI for first T20I vs New Zealand

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021 పరాభవాన్ని మరిచిపోయి.. 2022 ప్రపంచకప్‌పై దృష్టిసారించాలనుకుంటున్న భారత జట్టు ఆ దిశగా రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయింది. ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ న్యూజిలాండ్‌తో ఈరోజు నుంచే పొట్టి సిరీస్‌ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరోకొద్దిసేపట్లో ఆరంభం అయ్యే మొదటి టీ20లో న్యూజిలాండ్‌ను భారత్‌ ఢీకొంటుంది. ప్రపంచకప్‌లో న్యూజిల్యాండ్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం చేసేందుకు టీమిండియా సిద్ధమైంది.

అయితే ఈ మ్యాచులో టీమిండియా తుది జట్టుపై ఆసక్తినెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు, స్టార్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన తుది జట్టును వెల్లడించాడు. కివీస్‌తో బరిలోకి దిగే ఆకాష్ జట్టును ఓసారి చూద్దాం.

ఓపెనర్‌గా కిషన్ రావాలి

ఓపెనర్‌గా కిషన్ రావాలి

టీమిండియా ఓపెనింగ్ జోడీగా లోకేష్ రాహుల్‌, రోహిత్‌ శర్మ రాకపోవచ్చని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రావాలన్నాడు. రాహుల్ బాగా ఆడుతున్నా.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బాగుంటుందన్నాడు. రాహుల్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి.. మూడో స్థానంలో వస్తే బెటర్ అని అభిప్రాయపడ్డాడు.

సూర్యకుమార్ యాదవ్ నెం.4లో రావాలని చోప్రా సూచించాడు. శ్రేయాస్ లేదా వెంకటేష్‌లో ఒక అయ్యర్‌ను మాత్రమే భారత్ ఎంచుకునే అవకాశం ఉందన్నాడు. శ్రేయాస్ సీనియర్ కాబట్టి అతడిని ఎంచుకునే అవకాశం ఉందని, అయితే వెంకటేష్‌కు మరలా ఎప్పుడు అవకాశం ఇస్తారో చూడాలన్నాడు.

 చహల్‌కు బదులు అక్షర్

చహల్‌కు బదులు అక్షర్

రిషబ్ పంత్, అక్షర్ పటేల్ వరుసగా నెం.6, నెం.7లో రావాలని ఆకాశ్ చోప్రా అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను భారత జట్టులోకి తీసుకున్నందున.. అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో స్పిన్నర్ స్థానంలో యుజ్వేంద్ర చహల్‌ను ఎంచుకోవద్దన్నాడు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి వస్తే.. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి అక్షర్ పటేల్ బెస్ట్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ మరియు భువనేశ్వర్ కుమార్‌లను పేసర్లుగా ఎంచుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సిరాజ్, చహర్‌లకు అవకాశం ఇవ్వాలని చోప్రా సూచించాడు.

మంచు ప్రభావం

మంచు ప్రభావం

తొలి టీ20 జరిగే జైపూర్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని, కానీ మంచు ప్రభావం కూడా బాగా ఉండొచ్చని స్టార్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా చెప్పాడు. మంచు కారణంగా టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంటుందని అన్నాడు. అలాగే కివీ ఓపెనర్ల కన్నా కూడా భారత ఓపెనర్లే ఎక్కువ పరుగులు చేస్తారని ఆకాష్ జోస్యం చెప్పాడు. మ్యా చ్‌ వేదిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం ఇంతకుముందెప్పుడూ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వలేదు. ఇక్కడ చివరిసారి 2013లో అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది. తొలి టీ20 కోసం సిద్ధం చేసిన పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నారు.

 ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్/వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్‌, మహ్మద్ సిరాజ్.

Story first published: Wednesday, November 17, 2021, 17:15 [IST]
Other articles published on Nov 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+