Aakash chopra: పెద్ద ప్రాబ్లమొచ్చింది.. కోహ్లీ రికార్డులు ఎలుగెత్తి చాటితే గానీ జట్టులో చోటు కష్టం
వెస్టిండీస్ పర్యటనలో విరాట్ కోహ్లీకి ఎందుకు విశ్రాంతి ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్లో కానీ టీ20 సిరీస్లో గానీ ఏదో ఒకదాంట్లో అయినా అతను ఆడాల్సిందని చెప్పాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం కఠినమైన పాచ్‌ను ఎదుర్కొంటున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్ అతనికి తెగ విశ్రాంతినిస్తోంది. వెస్టిండీస్ పర్యటనకు అతను పూర్తిగా దూరమయ్యాడు. జింబాబ్వేతో జరగబోయే వన్డే సిరీస్‌కు కూడా అతనికి విశ్రాంతే దక్కింది. ఇక కోహ్లీ గైర్హాజరీపై జతిన్ స్పారు యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. మళ్లీ కోహ్లీ గురించి అతని గణాంకాల గురించి ఎలుగెత్తి చాటాల్సిన పరిస్థితి వస్తోంది. అతను ఇటీవల పలు సిరీస్లకు దూరమవ్వడంతో అతని ఉనికిని గుర్తుచేయొల్సి వస్తోంది అని చోప్రా అన్నాడు. కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లలో కనీసం వన్డేలు లేదా టీ20ల్లోనైనా ఆడాల్సి ఉండాల్సిందని ఆకాష్ చెప్పాడు.

వారు రెగ్యులర్‌గా ఆడుతున్నారు కాబట్టి
'సమస్య ఏమిటంటే విరాట్ గణాంకాలను మళ్లీ అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే అతను ఇటీవల చాలా తక్కువ సిరీస్లు ఆడాడు. పైగా ఆ సిరీస్లలో ఏమాత్రం రాణించలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అన్ని మ్యాచ్‌లలో పెద్ద స్కోర్లు చేయలేదు. కానీ వారు రెగ్యులర్‌గా ఆడుతున్నారు కాబట్టి వారు ఆడిన మంచి ఇన్నింగ్స్ గుర్తుంటున్నాయి. అది విరాట్ కోహ్లీ విషయంలో మిస్సవుతుంది. విరాట్ జట్టులోకి వస్తాడనడంలో సందేహం లేదు కానీ వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ కానీ టీ20 సిరీస్ కానీ ఆడాల్సింది' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

ఆటలో ఎవరి స్థానమెంటో తెలిసుండాలి
చోప్రా మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్‌ను భారత్ నంబర్ 4స్థానంలో ఉంచాలని ఫిక్సయింది. కానీ అనూహ్యంగా వెస్టిండీస్‌పై అతన్ని ఓపెనర్‌గా ప్రయోగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని ఆకాష్ అంగీకరించాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడంపై యాదవ్‌కు అవగాహన ఉందని, ఆటలో స్థానాలు ముఖ్యమని ఆకాష్ పేర్కొన్నాడు.

నాకైతే అర్థం కావట్లేదు
'అతన్ని ఓపెనర్ స్థానంలో పంపడం వెనుక ఉన్న ఆలోచన నాకైతే అర్థం కాలేదు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. సూర్యకుమార్‌కు ఆ స్థానంలో ఉన్న కష్టనష్టాలు తెలుసు. పైగా అతను ఫామ్‌లో కూడా ఉండడంతో తన పాత్రపై తనకు అవగాహన ఉంది. టీ20లు, టెస్టుల్లో ప్లేయర్ల బ్యాటింగ్ స్థానాలు చాలా ముఖ్యమైనవని నేను భావిస్తున్నాను. మీరు డీకేను లేదా హార్దిక్‌ని ఎందుకు ముందు స్థానాల్లో పంపకూడదు? ఎందుకంటే వారికంటూ నిర్దిష్ట పాత్ర ఉంది. అందువల్ల వాళ్లు దిగాల్సిన స్థానంలోనే దిగుతారు. అలాంటప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను ఎందుకు ఓపెనర్‌గా పంపించాలి? అంటూ ఆకాష్ ప్రశ్నలు గుప్పించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications