Aakash Chopra: ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్‌లో అతనికి చోటు ఖాయం.. కానీ సిరాజ్‌కే కష్టం!

IND VS ENG : Team India's Weakness సిరాజ్ కష్టం Rahul ఖాయం - Aakash Chopra || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఈ సుదీర్ఘ సిరీస్‌కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌లో ఇదే ఫస్ట్ సిరీస్ కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఈ సిరీస్‌ కోసం టీమిండియా అన్ని విధాలుగా సన్నదమవుతోంది. ఇప్పటికే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు.. నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ బరిలో దిగే భారత తుది జట్టుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టులో సీనియర్లు, జూనియర్లతో ఒక్కో ప్లేస్‌‌కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీపడుతున్నారు.

ఈ క్రమంలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా? లేక అనుభవానికి ఓటేస్తూ సీనియర్ ప్లేయర్లకు అవకాశం ఇస్తారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా భారత తుది జట్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ జట్టులో ఉండటం ఖాయమన్నాడు.

రాహుల్‌కు పక్కా చాన్స్

రాహుల్‌కు పక్కా చాన్స్

భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో పటిష్టంగా ఉన్న బ్యాటింగ్‌లో మాత్రం బలహీనంగా ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఈ బలహీనతను అధిగమించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకొని, మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం ఉందని తెలిపాడు.

ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం కేఎల్ రాహుల్‌కు ఉంది. అతనికి ఇక్కడ ఓ సెంచరీ కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన వామప్ మ్యాచ్‌లో రాహుల్ శతకంతో మెరిసాడు. కాబట్టి అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం.

రోహిత్ జోడీపై నమ్మకం లేదు..

రోహిత్ జోడీపై నమ్మకం లేదు..

రాహుల్‌ను మిడిలార్డర్ లేదా, ఓపెనర్‌గా ఆడించవచ్చు. ఈ కారణంతోనే సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారు. భారత బ్యాటింగ్‌ కూడా బలహీనంగా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ ఫామ్‌లో లేడు. ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ విదేశాల్లో తమ సత్తాను నిరూపించుకోలేదు. హనుమ విహారి నిలకడగా రాణిస్తాడని చెప్పలేం. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ నేపథ్యంలోనే రాహుల్‌కు చోటు దక్కుతుందని చెబుతున్నా. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే చాన్సుంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

నో సిరాజ్..

నో సిరాజ్..

ఇక బౌలింగ్ విభాగంలో మరోసారి సీనియర్లకే అవకాశం దక్కనుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైనప్పటికీ.. మళ్లీ వారికి చాన్స్ ఇస్తారన్నాడు. మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌లకు మరోసారి నిరాశతప్పదన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మమమ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మలతోనే పేస్ విభాగం ఉంటుందని, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉంటున్నారన్నాడు. అక్షర్ పటేల్‌కు కూడా నిరీక్షణ తప్పదన్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 2, 2021, 15:41 [IST]
Other articles published on Aug 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X