న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra : ఈ వీడియో చూస్తే మీరేంటో మీ విధానాలేంటో తెలుస్తున్నాయిలే.. కామెంట్ చేయడం కూడా వేస్టే

Aakash Chopra Gave A strong Counter to England Critics After Deepti Sharma Mankading Issue

ఇటీవల ఇంగ్లాండ్ వుమెన్స్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత వుమెన్స్ స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ.. చార్లీ డీన్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయమై నెట్టింట్ట ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. ఇంగ్లాండ్ మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఇది స్ఫూర్తి లేని ఆట అంటూ మండిపడ్డారు. ఇక టీమిండియా మాజీ బ్యాటర్, క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా ఈ రనౌట్ విషయమై స్పందించాడు. గతంలో ఇంగ్లాండ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ అమీ జోన్స్‌.. ఓ క్యాచ్ విషయంలో ప్రవర్తించిన విధానాన్ని ఎండగట్టాడు. స్ఫూర్తి గురించి ఇంగ్లాండ్ ప్లేయర్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేయకుండానే చెప్పేశాడు. ఇకపోతే లార్డ్స్‌లో గెలుపుతో భారత్ వన్డే సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ విజయానికి 17పరుగులు చేయాల్సిన తరుణంలో.. దీప్తి చాకచక్యంగా నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న డీన్‌ను రనౌట్ చేసింది.

2020జనవరిలో భారత్‌ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టీ20 మ్యాచ్‌కు సంబంధించిన పాత వీడియోను ఆకాష్ చోప్రా అప్‌లోడ్ చేస్తూ ఇంగ్లాండ్ ప్లేయర్ల స్ఫూర్తిని ఎండగట్టాడు. ఆ మ్యాచ్'లో స్మృతి మంధాన కీపర్ క్యాచ్ అవుట్ అయి వెళ్లిపోయే టైంలో స్టాండ్-ఇన్ అంపైర్లు అది నాటౌట్ అని తిరిగి క్రీజులోకి పిలిచారు. వికెట్ కీపర్ అయిన అమీ జోన్స్ బంతిని క్యాచ్ అందుకుంటూ క్లియర్ కట్‌గా గ్రౌండ్‌పైకి జారవిడిచింది. అయితే ఆమె వెనకాల నుంచి ఏమీ ఎరుగనట్టు బాల్ అందుకుని ఔట్ అంటూ సెలబ్రేట్ చేసుకుంది. రిప్లేలో జోన్స్ బండారం బయటపడింది. ఆ మ్యాచ్ అనంతరం తన వ్యవహారం పట్ల అమీ జోన్స్ క్షమాపణలు కూడా చెప్పుకుంది. అయినప్పటికీ.. ఆమె స్ఫూర్తి రాహిత్యం నిజంగా అత్యంత దారుణం.

తాజాగా డీన్ రనౌట్‌ విషయంలో దీప్తిని ఆడిపోసుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు, అభిమానులు.. అప్పట్లో అమీ జోన్స్ బండారాన్ని ఎలా మర్చిపోయారు అంటూ ఆకాష్ చోప్రా మండిపడ్డాడు. దీప్తి చేసిన పని క్రికెట్ చట్టాలకు కంప్లీట్ లీగల్ అని ఆకాష్ పేర్కొన్నాడు. ఇక భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం ఈ విషయమై దీప్తికి మద్దుతిచ్చింది. దీప్తి ఐసీసీ నిబంధనలకు తగ్గట్లుగానే వర్కౌట్ చేసింది. ఆమె ఏం తప్పు చేయలేదు అంటూ మర్మన్ మ్యాచ్ అనంతరం తెలిపింది.

Story first published: Monday, September 26, 2022, 12:29 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X