Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: మనీశ్‌ పాండే పేలవంగా ఆడతాడు.. అతడిని ఆడించొద్దు: ఆకాశ్‌ చోప్రా

Aakash Chopra feels Manish Pandey should be played in the middle order vs Sri Lanka Tour

ముంబై: శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేను టాప్‌లో కాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో ఆడించాలని భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున టాప్‌ ఆర్డర్‌లో బాగా ఆడతాడని, మిడిల్‌ ఆర్డర్‌లో పంపిస్తే పేలవంగా ఆడతాడని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం పాండేను మిడిల్‌ ఆర్డర్‌లోనే ఆడించాలన్నాడు. టాప్‌ ఆర్డర్‌లో ఆడేందుకు పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారని.. దాంతో మనీశ్‌ను మిడిల్‌ ఆర్డర్‌లో పంపాలన్నాడు. 2015లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మనీష్.. ఇప్పటివరకు 26 వన్డేలు మరియు 39 టీ20లు ఆడాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ... 'మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ను తప్పకుండా ఆడిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మనీశ్‌ పాండేను ఎంపిక చేస్తే కచ్చితంగా మిడిల్‌ ఆర్డర్‌లో అవకాశం ఇవ్వాలి. అయితే అతడిని టాప్‌ మూడులో ఆడనివ్వకూడదు. ఎందుకంటే మనీశ్‌ మిడిల్‌ ఆర్డర్‌లోనే సరిపోతాడు. అక్కడ ఆడితే మంచిది. లేకపోయినా ఫర్వాలేదు. అతడిని ఐదో స్థానంలో ఆడించి తర్వాత హార్దిక్‌ పాండ్యాను ఆరో స్థానంలో కొనసాగించడం ఉత్తమం' అని అన్నాడు.

టీమిండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ త‌ర‌ఫున ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ వ‌న్డే అరంగేట్రం చేస్తున్నారు. టీ20ల్లో ఇండియ‌న్ టీమ్ త‌ర‌ఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్య‌కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌.. ఈ మ్యాచ్‌తో వ‌న్డేల్లో అడుగుపెట్టారు. ప్రేమదాస మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డం ఆన‌వాయితీ. ఇదే లంక మరోసారి చేసింది. లంక టీమ్ త‌రఫున భ‌నుక రాజ‌ప‌క్స అరంగేట్రం చేశాడు. చాన్నాళ్ల తర్వాత కుల్దీప్ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌ కలిసి ఆడుతున్నారు. శిఖర్ ధావన్‌తో కలిసి పృథ్వీ షా ఓపెనింగ్‌ చేయనున్నాడు.

తుది జట్లు:
భారత్: శిఖర్‌ ధావన్ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, మనీష్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌.
శ్రీలంక: దసన్ షనకా (కెప్టెన్‌), అవిష్కా ఫెర్నాండో, భానుక రాజపక్సా, మినోద్‌ భానుకా, దనంజయ డిసిల్వా, చరిత్‌ ఆసాలంకా, వినిందు హసరంగా, చమికా కరుణరత్నే, ఇసుర ఉదానా, దుస్మంతా చమీరా, లక్షణ్‌ షన్‌దాకన్‌.

Story first published: Sunday, July 18, 2021, 16:06 [IST]
Other articles published on Jul 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+