న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra : జట్టు ప్లాన్స్ అన్నీ చెడిపోయాయా..? అందుకే ఉమేష్‌ను తీసుకొచ్చారా?

Aakash Chopra concerns About Teamindia Selection and Plans

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక విషయమై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పలు ప్రశ్నలు గుప్పించారు. గత కొంతకాలంగా భారత జట్టు తరఫున మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌ ఆడలేదు. దీంతో వారిద్దరిని ఎంపిక చేయడం కాస్త వెరైటీగా అనిపించిందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. షమీ ఈ సంవత్సరం ఒక్క టీ20 గేమ్ కూడా భారత జట్టు తరఫున ఆడలేదు. 2019నుంచి ఉమేష్ యాదవ్ జాతీయ జట్టు తరఫున ఆడలేదు. ప్రపంచ‌కప్‌కు ముందు భారత జట్టు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను ప్రయత్నించాలని చూస్తోంది. కానీ కరోనా వల్ల ప్రపంచకప్ బ్యాకప్ బౌలర్‌గా సెలెక్ట్ అయిన షమీని ఆసీస్ సిరీస్లో పరీక్షించడం కుదరదు.

'గత ప్రపంచ‌కప్ నుంచి భారత్ చాలా టీ20 గేమ్‌లను ఆడింది. అయితే మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌లు ఎవరూ కూడా ఈ టీ20ల్లో పాల్గొనలేదు. ప్రపంచకప్‌కు కేవలం నాలుగు వారాలు మాత్రమే ఉంది. ఈ సమయంలో వీరిద్దరు జట్టు ప్రణాళికలలో భాగమయ్యారు. జట్టు అనుకున్న ప్రణాళికలు ఫెయిలవ్వడంతో ఇప్పుడు ఇబ్బందిగా ఉందా.. అందుకేనా ఉమేష్‌ను తీసుకొచ్చారా' అని ఆకాశ్ చోప్రా ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఆస్ట్రేలియా సిరీస్‌ ముంగిట కరోనా బారిన పడడంతో మహ్మద్ షమీని తొలగించి అతని స్థానంలో ఉమేష్ యాదవ్‌ను చేర్చాల్సి వచ్చింది. ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఉమేష్ యాదవ్, షమీ వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు చాలా సంవత్సరాలుగా ఆడుతున్నవారు. అందువల్ల వాళ్లు ఆటోమేటిక్ ఎంపిక ఆప్షన్లు అని పేర్కొన్నాడు.

'చాలాకాలంగా బౌలింగ్ చేస్తున్న ఉమేష్, షమీ లాంటి ప్లేయర్లను కొత్తగా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు' అని రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. వారు ఏ ఫార్మాట్‌లో ఆడినా తమను తాము మంచి ప్లేయర్లుగా నిరూపించుకున్నవారే. వారి క్వాలిటీని మేము అర్థం చేసుకున్నాం. కొత్త కుర్రాళ్లయితే వాళ్లు ఈ ఫార్మాట్‌కు సెట్ అవుతారా కాదా అని ఆలోచించొచ్చు కానీ షమీ, ఉమేష్ లాంటి ప్లేయర్లు ఆటోమేటిక్ పిక్ ప్లేయర్లు. వారు ఫిట్‌గా ఉంటే సరిపోతుంది.' అని రోహిత్ చెప్పాడు.

Story first published: Sunday, September 18, 2022, 16:55 [IST]
Other articles published on Sep 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X