
బాబర్ ఆజామ్..
తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ రెండు లీగ్స్‌ను విశ్లేషించిన చోప్రా.. రెండు అత్యుత్తమ జట్లను ఎంపిక చేశాడు. పీఎస్ఎల్ ఫైనల్లో అదరగొట్టిన పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను తీసుకున్న చోప్రా.. ఫకార్ జమాన్, అలెక్స్ హెయిల్స్, మహ్మద్ హఫీజ్, బెన్ డంక్లతో బ్యాటింగ్ విభాగాన్ని పూర్తి చేశాడు. ఇమాద్ వాసిమ్, డేవిడ్ వీస్లను ఆల్రౌండర్లుగా తీసుకున్నాడు. హారీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, షాహిన్ అఫ్రిదిలను ప్రధాన పేసర్లుగా ఎంచుకున్న చోప్రా.. ఇమ్రాన్ తాహిర్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా తీసుకున్నాడు.

నో కోహ్లీ, రోహిత్..
ఇక ఐపీఎల్ అత్యుత్తమ జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను పక్కనపెట్టిన ఈ మాజీ క్రికెటర్.. శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఇషాన్ కిషన్లతో బ్యాటింగ్ లైనప్‌ను పూర్తి చేశాడు. రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్లను ఆల్‌రౌండర్‌గా తీసుకున్న చోప్రా.. కగిసోరబడా, జస్ప్రీత్ బుమ్రాలను ప్రధాన బౌలర్లుగా ఎంచుకున్నాడు. ఇక చాహల్, రషీద్ ఖాన్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా తీసుకున్నాడు.

గెలుపు ఐపీఎల్ టీమ్‌దే..
ఈ రెండు అత్యుత్తమ జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ మ్యాచ్ జరిగితే ఐపీఎల్ 2020 బెస్ట్ ఎలెవన్ గెలుస్తుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడా పేస్ త్రయాన్ని పీఎస్ఎల్ బెస్ట్ ఎలెవన్ ఎదుర్కోవడం కష్టమన్నాడు. రషీద్ ఖాన్ స్పిన్ మాయజాలం కూడా ఐపీఎల్ టీమ్‌కు ప్లస్ అని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ టీమ్‌లో ఏబీడీ, శిఖర్ ధావన్ ఉంటే.. పీఎస్ఎల్లో ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్ ఉన్నారని తెలిపాడు.

ఆకాశ్ చోప్రా బెస్ట్ టీమ్స్..
ఐపీఎల్ 2020 బెస్ట్ ఎలెవన్: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడా
పీఎస్ఎల్ 2020 బెస్ట్ ఎలెవన్: బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్, అలెక్స్ హేల్స్, మహ్మద్ హఫీజ్, బెన్ డంక్, ఇమాద్ వసీమ్, డేవిడ్ వైసీ, ఇమ్రాన్ తాహిర్, హారిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, షాహిన్ అఫ్రిది