Aakash Chopra: టీమిండియాలో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లే లేరు

భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. హార్దిక్ పాండ్యాను వేనోళ్ల కొనియాడు. 'వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియాకు అత్యంత విలువైన ఆటగాడు హార్దిక్ పాండ్యా' అని చోప్రా పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హార్దిక్ 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ 2-1తో విజయం సాధించింది. డిసైడర్ అయిన చివరి మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడానికి అతనో ప్రధాన కారణం. తొలుత హార్దిక్ బంతితో 24పరుగులకు వికెట్లు తీసి రాణించాడు. తర్వాత బ్యాటింగ్లో 71పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ (125*)తో కలిసి 133 పరుగుల అయిదో వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తద్వారా భారత్ 260పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

హార్దిక్‌కు ప్రత్యామ్నాయం దొరకడం కష్టమే..
'హార్దిక్ పాండ్యా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నాడు. అతను వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియాకు అత్యంత విలువైన ఆటగాడనే విషయం రుజువవుతోంది. ప్రస్తుతం విలువైన ఆటగాళ్ల విషయంలో అతనికి సరిసమానంగా ఎవరూ ఉండరనుకుంటున్నాను.' అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయం వ్యక్తం చేశాడు స్పిన్ ఆల్‌రౌండర్లను దొరకబుచ్చుకోవడం సాధ్యమే కానీ.. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మరో ఆల్రౌండర్ దొరకడం కష్టమని చెప్పాడు.

నంబర్ 1 పెర్ఫార్మర్
'హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే పర్లేదు. కానీ అతను అందుబాటులో లేకుంటే అతని స్థానాన్ని భర్తీ చేసేవారు లేరు. టీమిండియా తరఫున మీరు చాలా మంది స్పిన్ ఆల్రౌండర్లను ఆడించగలుగుతారు. అన్ని ఫార్మాట్లకు మీకు అలాంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. కానీ మీకు హార్దిక్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు అస్సలు దొరకరు. ఇది అస్సలు సాధ్యం కాదు' అని ఆకాష్ చోప్రా అన్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో అతనిని నంబర్ 1 పెర్ఫార్మర్‌గా చోప్రా పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటి నుంచి అసాధారణ ఆటతీరు కనబరుస్తున్నాడని, బ్యాట్‌తో మ్యాచ్‌లను ముగించే బాధ్యతను తీసుకుంటున్నాడని తెలిపాడు.

వేరే రేంజులో మెచురిటీ కన్పిస్తుంది
'ఇప్పుడు హార్దిక్ బౌలర్‌గా పూర్తిస్థాయిలో సత్తా చాటుతున్నాడు. అతని బౌలింగ్లో ఓ నిలకడ కన్పిస్తుంది. అతని బ్యాటింగ్‌లో వేరే రేంజులో మెచురిటీ కనిపిస్తుంది. అతనిలా ఆడడానికి బహుశా ఐపీఎల్‌కు ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుందేమో. ఎందుకంటే ఐపీఎల్లో అతని భుజాలపై బాధ్యత నెలకొనడంతో ఓ భిన్నమైన పద్ధతిలో అతను ఆడే అవకాశం వచ్చింది. గతంలో అతను చివర్లో వచ్చి ఫినిషర్‌గా ఆడేవాడు. కానీ ఇప్పుడు 4 లేదా 5వ నంబర్లో బరిలోకి దిగుతూ మ్యాచ్‌ను అద్భుతంగా నడిపించగలుగుతున్నాడు.నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లాండ్ పర్యటనలో నంబర్ 1 ప్రదర్శన ఎవరిదీ అని అడిగితే హార్దిక్ అని నిస్సంకోంచగా చెప్పగలుగుతాను' అని చోప్రా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications