
ఆసియాకప్ - 2022లో భారత్‌తో జరగబోయే మ్యాచ్‌లో షాహీన్ షా ఆఫ్రిది లేకపోవడం పాకిస్థాన్ జట్టును పోటీలో తీవ్రంగా వెనక్కి నెట్టిందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన కూడా భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించగలదని ఆకాష్ చెప్పాడు. గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మోకాలి స్నాయువుకు గాయం కావడంతో షాహీన్ షా అఫ్రిది గత వారం ఆసియా కప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే షాహీన్ అఫ్రిది జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో మహ్మద్ హస్నైన్ జట్టులోకి వచ్చాడు.
'దుబాయ్‌లోని పిచ్‌లో చాలా పచ్చిక ఉంటుంది. అది పేసర్‌లకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. షాహీన్ అఫ్రిది లేకపోవడం పాకిస్తాన్‌ను పోటీలో చాలా వెనక్కి నెట్టింది. టాస్ గెలిచినా ఓడినా భారత్ పాకిస్థాన్‌ను ఓడించగలదని నేను అనుకుంటున్నాను. పాకిస్థాన్ బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది లేకపోవడంతో ఆ జట్టుకు సరైన ఆరంభం దొరకకపోవచ్చు' అని ఆకాష్ చోప్రా అన్నాడు. ఇకపోతే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కోవిడ్ -19 నెగెటివ్ రావడంతో అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.
ఇరు జట్ల స్క్వాడ్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, నసీమ్ షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్.