ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా బౌచర్.. ఆకాష్ అంబానీ ‘మార్క్’ ప్లాన్

ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్ నియామకమయ్యాడు. ఐపీఎల్ 2023 నుండి తమ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం, రికార్డ్ హోల్డింగ్ వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌ను నియమించినట్లు ముంబై ఇండియన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ అయిన మార్క్ బౌచర్..
వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా సుదీర్ఘమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు. పదవీ విరమణ అనంతరం అతను దక్షిణాఫ్రికాలో అగ్ర స్థాయి క్రికెట్ ఫ్రాంచైజీ అయిన టైటాన్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతని ఆధ్వర్యంలో ఆ జట్టు ఐదు దేశవాళీ టైటిల్స్ గెలుపొందింది. 2019లో క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్ నియమితుడయ్యాడు. సౌతాఫ్రికా జాతీయ జట్టు అతని హయాంలో 11 టెస్ట్ విజయాలు, 12 వన్డేలు, 23 టీ20 విజయాలు సాధించింది.
జయవర్ధనేకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో..
ఇకపోతే మొన్నటివరకు ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా పనిచేసిన మహేలా జయవర్ధనే.. సెంట్రల్ టీం (ముంబై ఇండియన్స్, ఎంఐ కేప్ టౌన్, ఎంఐ ఎమిరేట్స్) జట్ల బాధ్యతలు చూసుకునే.. గ్లోబ్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ కోచ్ బాధ్యతల్లో మార్క్ బౌచర్‌ను ఫ్రాంచైజీ నియమించింది. అలాగే గ్లోబ్ హెడ్ ఆఫ్ డెవలప్ మెంట్ పాత్రలో జహీర్ ఖాన్ నియామకం అయ్యాడు. అతను ఇంతకుముందు ముంబై టీం డైరెక్టర్‌గా పనిచేశారు.

బౌచర్ చేరిక జట్టుకు విలువను జోడిస్తుందన్న అంబానీ
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ మిస్టర్ ఆకాష్ అంబానీ.. మార్క్ బౌచర్ నియామకం గురించి మాట్లాడుతూ.. 'మార్క్ బౌచర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి స్వాగతించడం ఆనందంగా ఉంది. గ్రౌండ్లో, గ్రౌండ్ బయట అతనేంటో నిరూపించుకున్నాడు. అతని మార్గదర్శక నైపుణ్యంతో కోచ్‌గా జట్టును అనేక విజయాలకు మార్గనిర్దేశం చేస్తాడు. మార్క్ బౌచర్ చేరిక ముంబై ఇండియన్స్‌కు అపారమైన విలువను జోడిస్తుంది. జట్టు వారసత్వాన్ని మార్క్ బౌచర్ ముందుకు తీసుకువెళతాడని ఆశిస్తున్నా.' అని ఆకాష్ పేర్కొన్నాడు. మార్క్ బౌచర్‌ను కోచ్‌గా నియమించడం వల్ల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోని ఎంఐ కేప్‌టౌన్ జట్టు కూర్పు పట్ల అలాగే ముంబై ఇండియన్స్ బాధ్యతల పట్ల రెండు రకాలుగా యూజ్ అవుతుందని ఆకాష్ అంబానీ ఈ మార్క్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఛాలెంజ్ కోసం ఎదురుచూస్తున్నాను
ముంబై ఇండియన్స్ ప్రధాన్ కోచ్‌గా నియామకం పట్ల మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. 'ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా తనను నియమించడం చాలా గౌరవంగా విశేషంగాను ఉంది. ఫ్రాంచైజీగా ముంబై జట్టు చరిత్ర, ఆ జట్టు సాధించిన విజయాల బట్టి స్పష్టంగా ప్రపంచ క్రీడలన్నింటిలో అత్యంత విజయవంతమైన క్రీడా ఫ్రాంచైజీలలో ఒకటిగా ముంబై ఇండియన్స్ నిలుస్తుంది. నేను ఈ ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ముంబై గొప్ప నాయకత్వం, ఆటగాళ్లతో కూడిన బలమైన యూనిట్. ఈ డైనమిక్ యూనిట్‌కు విలువను జోడించడానికి నేను ఎదురుచూస్తున్నాను.' అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications