హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. లాహోర్‌లో ఆదివారం జరిగిన చివరి టి20లో పాకిస్థాన్... శ్రీలంకపై 36 పరుగుల తేడాతో సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా యూఏఈలో రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక, పాక్... ఆదివారం లాహోర్‌లోని గడాఫీ స్డేడియంలో మూడో టీ20ని ఆడాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో షోయబ్ మాలిక్ (51) హాఫ్ సెంచరీ చేయగా ఫకర్ జమాన్ (31), ఉమర్ అమిర్ (45), బాబర్ ఆజమ్ (34 నాటౌట్) సత్తా చాటారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
ఈ మూడు టీ20ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న మాలిక్‌కు స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. మ్యాచ్ అనంతరం బైక్‌పై షోయబ్ మాలిక్ కూర్చున్న ఫోటోని భార్య సానియా మీర్జా ట్వీట్ చేస్తూ 'మళ్లీ బైక్‌పై రైడ్‌కి వెళదామా?' అని కామెంట్ పెట్టింది.
సానియా మిర్జా ట్వీట్‌కు స్పందించిన షోయబ్ మాలిక్ 'స్వీట్ హార్ట్ తొందరగా సిద్ధం అవ్వు' అంటూ సమాధామనం ఇచ్చాడు.
ఆ తర్వాత షోయబ్ మాలిక్ మరో ఫోటో ట్వీట్ చేశాడు. అందులో తాను గెలుచుకున్న బైక్‌పై సహచర క్రికెటర్ షాదబ్ ఖాన్ కూర్చుని ఉన్నాడు. ఈ ట్వీట్‌కు సానియా మిర్జా 'సీటు ఖాలీ లేదా? నో ప్రాబ్లం' అంటూ భర్త షోయబ్‌ను ఆట పట్టించింది.
సానియా ట్వీట్‌కు షోయబ్ మాలిక్ మళ్లీ 'అతడిని గ్రౌండ్ చివర్లో దిగబెడతాను, మనం బైక్‌పై రైడ్‌కి వెళదాం' అని ట్వీట్ చేశాడు. ఇందుకు సానియా మిర్జా 'స్వారీ భాయ్' అంటూ షాదబ్ ఖాన్‌ని ఉద్దేశించి ట్వీట్ చేసింది. చాలాకాలం తర్వాత వీరిద్దరి మధ్య ట్విట్టర్‌లో ఇలాంటి సంభాషణ జరగడంతో ఇది వైరల్‌గా మారింది.