Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: పిచ్చపాటి ముచ్చటేసిన షాహీన్ షా, రషీద్ ఖాన్.. వీడియో వైరల్..

A video of Pakistan bowler Shaheen Shah Afridi and Afghanistan spinner Rashid Khan together is going viral

పాక్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది, ఆఫ్ఘానిస్థాన్ స్పన్నర్ రషీద్ ఖాన్ పిచ్చపాటిగా ముచ్చట పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు పాక్, ఆఫ్ఘాన్ వార్మప్ మ్యాచ్ ఆడాయి. సుదీర్ఘ గాయం తర్వాత పాకిస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చిన షాహీన్ షా అఫ్రిదీ ఆఫ్ఘాన్ బ్యాటింగ్ చేస్తుండగా 15వ ఓవర్లో డగౌట్‌లో రషీద్‌తో కలిసి కూర్చున్నాడు.

ICC
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ ఇద్దరూ కలిసి ఉన్న వీడియోను షేర్ చేసింది. ఆ సమయంలో రషీద్, షాహీన్ అందరూ చిరునవ్వులు చిందిస్తున్నట్లు కనిపించింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు ఇబ్రహీం జద్రాన్‌ 35 పరుగులు చేయగా.. మహ్మద్‌ నబీ 51 పరుగులు చేశాడు.

వర్షం
పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది , హరీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీయగా.. మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌లు చెరో వికెట్‌ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 19/0 వద్ద వర్షం రావడంతో మ్యాచ్ ఫలితం తేలకుండాపోయింది.

Story first published: Wednesday, October 19, 2022, 16:31 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+