Ravindra Jadeja: జిమ్‍లో వర్కవుట్ చేస్తున్న రవీంద్ర జడేజా.. వీడియో వైరల్..

టీమిండియా కీలకమైన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ఒక్కడు. అయితే అతను గాయం కారణంగా ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 వరల్డ కప్ కు దూరమయ్యాడు. రవీంద్ర జడేజా బౌలిగ్ తో పాటు బ్యాటింగ్ లో జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలు అందించాడు. ఆసియా కప్‌లో రవీంద్ర జడేజా మోకాలికి గాయమైంది.
2022 ఆసియా కప్‌లో జడేజా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న జడేజా గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
ఫిట్ నెస్
జడేజా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. ఈ ఆల్-రౌండర్ తన పునరాగమనానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి జడ్డూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో జడేజా జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కనిపించాడు. అంతకుముందు ఆపరేషన్ తర్వాత ర్కవీంద్ర జడేజా సోషల్ మీడియాలో ఒక హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నాడు. "సర్జరీ విజయవంతమైంది. BCCI, నా సహచరులు, సహాయక సిబ్బంది, ఫిజియోలు, వైద్యులు, అభిమానులకు ధన్యవాదాలు. నేను త్వరలో నా పునరావాసం ప్రారంభిస్తాను" అని చెప్పాడు.
రాహుల్ ద్రవిడ్
సెప్టెంబర్‌లో రాహుల్ ద్రవిడ్ రవీంద్ర జడేజా గాయం మాట్లాడాడు. ఈ ఆల్ రౌండర్ T20 ప్రపంచ కప్‌లో భాగమవుతాడని ఆశించాడు. "అతను వైద్య బృందం సంరక్షణలో ఉన్నాడు. ప్రపంచ కప్ చాలా దూరంలో ఉంది. అతను కోలుకుంటే అతడిని మినహాయించం " అని అన్నారు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కు
జడేజా ఒక్కడే కాదు బుమ్రా కూడా జట్టుకు దూరమయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అక్టోబర్ 23న పాక్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications