వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ బౌలర్ గా మారాడు. అవును మీరు విన్నది నిజమే. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పంత్ బౌలింగ్ చేశాడు. అయితే చివరి వేయడానికి వచ్చిన పంత్ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో పంత్ పురాణి ఢిల్లీ 6 తరఫున ఆడుతున్నాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ బౌలింగ్ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పురాణి ఢిల్లీ 197 పరుగులు చేసింది.
198 పరుగుల విజయలక్ష్యంతో బరిగిలోకి దిగిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ట్ కు చివరి ఓవర్ ఒక పరుగు సాధిస్తే విజయం సొంతం అవుతుంది. ఈ సమయంలోనే రిషబ్ పంత్ బౌలింగ్ వచ్చాడు. మొదటి బంతి వేయగానే.. ఢల్లీ సూపర్ స్టార్ట్ అటగాడు ఒక పరుగు చేశాడు. దీంత ఆ జట్టు విజయం సాధించింది. దీంతో పంత 6 బంతుల ఓవర్ లో కేవలం ఒకే బంతినే బౌల్ చేశాడు. మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకున్న పంత్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు.

ఇంతకీ పంత్ వేసింది ఫాస్ట్ బౌలింగా.. లేక స్పీన్నా అని మీకు డౌట్ రావొచ్చు. పంత్ స్పీన్ బౌలింగే వేశాడు. గతంలో వికెట్ కీపర్ గా ఉన్న ఎంఎస్ ధోని ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. గంభీర్ నేతృత్వంలో, ఈ నెల ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల పర్యటనలో చాలా మంది భారత బ్యాటర్లు అనూహ్యంగా కీలక సమయాల్లో బౌలింగ్ చేశారు. సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శుభ్‌మాన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మతో సహా అనేక మంది ప్రముఖ బ్యాటర్లు T20I, ODI సిరీస్‌లో బౌలింగ్ చేశారు.
T20I కెప్టెన్‌గా కొత్తగా నియమితులైన సూర్యకుమార్, రింకూ శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ టై చేశారు. చివరికి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసి విజయాన్ని అందించారు. అదే సమయంలో గిల్ రోహిత్ ఇద్దరూ ODI సిరీస్‌లో బౌలింగ్ చేయడం ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పురాణి ఢిల్లీ 6 తరఫున ఆడిన పంత్ 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు.