Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి పైత్యం రా నాయనా.. ఏకంగా స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లు

 A Variety Approach of Norway team, Nine Fielders in the Slip Position Makes Funny

యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఫీల్డింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. అక్టోబరు 6వ తేదీన గురువారం రొమేనియా వర్సెస్ నార్వే మధ్య జరిగిన 18వ మ్యాచ్‌లో నార్వే ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నార్వే బౌలర్‌ తప్పా మిగతా తొమ్మిది మంది ఫీల్డర్లు అందరూ స్లిప్‌లో నిల్చుని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇలా స్లిప్‌లో 9మంది ఫీల్డర్లు ఉంచిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. రొమేనియాతో జరిగిన యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ గ్రూప్ డీ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన నార్వే 10ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 97పరుగులు చేసింది. రొమేనియా.. ఛేజింగ్లో పూర్తిగా తడబడింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించడంలో పూర్తిగా విఫలమయింది. ఇక చివరికి 10ఓవర్లు ముగిసేసరికి రొమేనియా 7వికెట్లు కోల్పోయి కేవలం 54పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నార్వే 43పరుగుల తేడాతో గెలుపొందింది.

అయితే ఈ మ్యాచ్ టైంలో ఫీల్డర్లందరినీ స్లిప్‌లో కెప్టెన్ మోహరించాడు. కీపర్ దగ్గరి నుంచి గల్లీ వరకు 9 ఫీల్డర్లు మొత్తం బ్లాక్ చేసేశారు. ఇక ఈ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ చూస్తే ఇదెక్కడి పైత్యం రా నాయనా అని అనిపించక మానదు. ఇక బౌలర్ ఆఫ్ సైడ్ బాల్ వేయగా.. బ్యాటర్ హిట్ చేయడంతో ఆఫ్ సైడ్ దాదాపు బౌండరీ వరకు వెళ్లింది. అయితే ఫీల్డర్ పరిగెత్తి అందుకున్నాడు. ఏదేమైనా యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఇలాంటి చిత్రవిచిత్రాలు చాలా జరుగుతుంటాయి. అమెరికన్ మీడియా అవుట్‌లెట్ ఫాక్స్ స్పోర్ట్స్ వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో నార్వే ఆటగాడు రజా ఇక్బాల్ కేవలం 16 బంతుల్లో 32పరుగులు చేసి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రతిష్ తంగవేదియల్ 10 బంతుల్లో 16పరుగులతో రాణించాడు.

Story first published: Sunday, October 9, 2022, 16:51 [IST]
Other articles published on Oct 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+