
హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్ గెలిస్తే పరుగులే గుర్తుకొస్తాయ్ అందరికీ. కానీ, ఓడినప్పుడు మాత్రమే బౌలింగ్, ఫీల్డింగ్‌లు కనబడతాయి. సరిగ్గా గడిచిన రెండేళ్ల నుంచి అదే జరుగుతుంది. పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ, స్మిత్‌లతో పాటుగా స్పిన్నర్ల పేర్లు సైతం తెరమీదకొస్తున్నాయి. భారత్ అయితే ముమ్మాటికీ ప్రతి విజయంలోనూ బౌలర్ల ప్రత్యేక పాత్ర ఉందని చెప్తూనే ఉంది.
కచ్చితంగా చెప్పాలంటే గతేడాది స్పిన్నర్స్‌కు సూపర్ ఇయర్‌గా నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా స్పిన్నర్లు రెచ్చిపోయి వికెట్లు సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఆరు వందలకు పైగా వికెట్లు సాధించిన ఘనతను స్పిన్నర్లు మొదటిసారి తమ ఖాతాలో వేసుకున్నారు.
2017లో స‍్పిన్నర్లు సాధించిన టెస్టు వికెట్లు 638. ఫలితంగా గతేడాది స్పిన్నర్లు సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు(584)ను బద్దలు కొట్టారు. ఓవరాల్‌గా స్పిన్నర్లు ఐదు వందలకు పైగా సాధించింది కేవలం ఐదుసార్లు మాత్రమే.
2001లో 521 టెస్టు వికెట్లను తీసిన స్పిన్నర్లు.. 2004లో 577 వికెట్లు సాధించారు. ఇక 2015లో 554 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ల జాబితాలో నాథన్ లయాన్(63), అశ్విన్(56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.