న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో స్పిన్నర్లే కీలకం'

A slightly different beast: Pat Cummins compares Australian conditions with India

హైదరాబాద్: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తన జట్టు స్పిన్నర్లు పెద్ద పాత్ర పోషిస్తారని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా త్వరలో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరిస్ ఆడనుంది.

ఈ నేపథ్యంలో కమిన్స్ మాట్లాడుతూ "భారత్‌లో స్పిన్నర్లు పెద్ద పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నాను. గత సిరీస్‌లో మేం ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం. టీమిండియా సైతం ఇద్దరిని ఆడించింది. అందుకే భారత్‌లో స్పిన్నర్లు కీలకం. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పుతారు" అని అన్నాడు.

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్థాన్ ఒకటి: గేల్ ఆసక్తికర వ్యాఖ్యలుప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో పాకిస్థాన్ ఒకటి: గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు స్పిన్నర్లు

ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు స్పిన్నర్లు

ప్రస్తుతం భారత పర్యటనకు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఆస్టన్‌ ఆగర్‌, ఆడమ్‌ జంపా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఆట కొనసాగే కొద్దీ బంతి ఎక్కువ నునుపు అవుతుందని కమిన్స్ తెలిపాడు. ఫలింతగా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో బౌలింగ్‌ చేయడం అత్యంత సులభమని అన్నాడు.

బంతి ఎక్కువ నునుపు

బంతి ఎక్కువ నునుపు

"ఆటసాగే కొద్దీ కొత్త బంతి ఎక్కువ నునుపు అవుతుంది. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ సులభంగా బౌలింగ్‌ చేయొచ్చు. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఉపఖండం మైదానాలు చిన్నవి, వేగవంతమైనవి. కాబట్టి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బంతితో ఎక్కువ వేగం, బౌన్స్‌ రాబట్టడం కాస్త కష్టం" అని కమిన్స్ అన్నాడు.

జనవరి 14న ముంబైలో తొలి వన్డే

జనవరి 14న ముంబైలో తొలి వన్డే

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జనవరి 14న ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరు వేదికగా మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది భారత్‌లో జరిగిన ఐదు వన్డే సిరీస్‌ను 3-2తో ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 10, 2020, 17:41 [IST]
Other articles published on Jan 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X